యంగ్ హీరోనే. డాన్సులు బాగా చేస్తాడు. హుషారుగా తెరపై కనిపిస్తాడు. అన్నీ బాగానే వున్నా.. అవకాశాలు మాత్రం రావడం లేదు. దాంతో, ఈ మధ్య ట్రాక్ మార్చేశాడు.
గెస్ట్ రోల్స్‌కీ, సైడ్ క్యారెక్టర్స్‌కీ పడిపోయాడు. అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల పక్కన సైడ్ క్యారెక్టర్లు పోషించి వావ్ అనిపిస్తున్నాడీ యంగ్ హీరో. హీరోగా చేసిన పలు చిత్రాలు ఓ మోస్తరు హిట్స్ అనిపించుకున్నాయంతే, కెరీర్ స్టార్టింగ్‌లో వచ్చిన ఒకటీ అరా సినిమాలు హిట్ అనదగ్గ స్థాయిలో వున్నప్పటికీ, ఆ తర్వాత కెరీర్ డౌన్ ఫాల్ అవుతూ వచ్చింది.
దాంతో, ఈ మధ్యనే ట్రాక్ మార్చేశాడు. ఏదో ఒక రకంగా ఫేమ్‌లో వుండాలంటే, వచ్చిన చిన్నా చితకా ఆఫర్స్‌ని సైతం వాడుకోవల్సిందే. అదే ట్రెండ్ ఫాలో చేస్తున్నాడనుకుంటా ఈ కుర్ర హీరో బహుశా.
ఈ నేపథ్యంలోనే తాజాగా 15 ఏళ్ల కుర్రాడికి తండ్రిగా ఆఫర్ వచ్చిందట. మరీ పెద్ద తరహా పాత్ర అని ఒప్పుకోవాలా వద్దా అనుకుంటున్నాడట. థ్రిల్లర్ మూవీ అని తెలుస్తోంది. కాన్సెప్ట్ నచ్చేసిందట. ఆడియన్స్‌కి బాగా రీచ్ అయ్యే సబ్జెక్ట్ అనీ తెలుస్తోంది. సో, లక్కు బాగుంటే ఈ కుర్ర హీరో దశ తిరిగే ఛాన్స్ లేకపోలేదు.
అయితే, 15 ఏళ్ల కుర్రోడికి తండ్రిగా అంటే కాస్త ఆలోచించాలి మరి. ఆ రిస్క్ ఈ యంగ్ హీరో చేస్తాడా.? బడా ఫిలిం బ్యాక్ గ్రౌండ్ వున్నోడే అని తెలుస్తోంది. అసలింతకీ ఎవరీ యంగ్ హీరో.?