బాలయ్య గ్రీన్ సిగ్నల్ కోసం హీరో వెయిటింగ్.. వరుసగా రెండు సినిమాలు

నందమూరి బాలకృష్ణ ఎలాంటి ప్రాజెక్ట్ చేసినా కూడా అభిమానుల్లో ఒక తెలియని జోష్ మొదలవుతుంది. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా తప్పితే తరువాత ప్రాజెక్ట్ ఎవరితో అనే విషయంలో ఆయన ఇంకా క్లారిటీ అయితే ఇవ్వలేదు. లాక్ డౌన్ లో మిగతా హీరోలు మూడేళ్లకు సరిపడా ప్రాజెక్టులను సెట్ చేసుకుంటే బాలయ్య మాత్రం ఇంకా BB3తోనే కాలాన్ని గడిపేస్తున్నారు. ఆ తరువాత ఎలాంటి సినిమా చేస్తారనేది అభిమానుల్లో ఒక తెలియని ఆసక్తిని రేపుతోంది.

అప్పట్లో బి.గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆల్ మోస్ట్ రెడీ అయ్యారని టాక్ వచ్చింది. కానీ ఇంకా కథ సరిగ్గా సెట్ కాలేదని రూమర్స్ వస్తున్నాయి. దర్శకుల పేర్లు చాలానే వస్తున్నాయి గాని ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం రావట్లేదు. కాస్త లోతుగా వెళ్లి ఆరా తీస్తే బాలయ్య రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులో కొత్త దర్శకుడు నాగశౌర్యతో అనుకుంటున్న ఒక సినిమా ఉంది. అలాగే కందిరీగ, రభస ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ తో కూడా ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారట.

ఈ రెండు ప్రాజెక్టులపై బాలయ్య పాజిటివ్ గానే ఉన్నాడట. ఆయన డేట్స్ ఇచ్చారు అంటే వెంటనే ఎనౌన్స్మెంట్ ఇవ్వాలని రెండు చిత్రాలు నిర్మాతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరి బాలకృష్ణ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి. ఇక బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయ్యింది. వచ్చే ఏడాది సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వస్తోంది.