గురూజీతో సినిమా.? వద్దు లే.!

గురూజీ అంటే తెలుసు కదా.? ఇంకెవరు త్రివిక్రమ్ శ్రీనివాస్.! పవన్ కళ్యాణ్ సినిమాలకి కథ అందించడం, రచనా సహకారం అందించడం.. ఈ బిజీలో దర్శకుడిగా సినిమాలు చేయడం తగ్గించేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.

‘గుంటూరు కారం’ సినిమా మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిందే. కానీ, సినిమా నిర్మాణంలో ఆపసోపాల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ట్రైలర్ చూశాక, ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా కాదనేశారు చాలామంది. ఆ టచ్ ఎక్కడా కనిపించలేదు మరి.! సినిమా హిట్టయితే సరే సరి, లేకపోతే మాత్రం.. త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రాండ్ ఇమేజ్‌కి చాలా పెద్ద కష్టమే వచ్చి పడుతుంది.

ఇదిలా వుంటే, ఓ యంగ్ హీరోతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తదుపరి సినిమా.. అనే ప్రచారం జరిగింది. అన్నీ దాదాపుగా ఓకే అయిపోయాయి కూడా. కానీ, ‘గురూజీతో సినిమానా.? వద్దులే..’ అని సదరు యంగ్ హీరో లైట్ తీసుకున్నాడంటూ ఓ గాసిప్ గుప్పుమంటోంది.

ఎవరా యంగ్ హీరో.. ఏమా కథ.? గురూజీతో సినిమాని కాదనేంత సీన్ వుంటుందా.? నిప్పు లేకుండా పొగ రాదన్నది పాత సామెత. కానీ, నిప్పు లేకుండానే పొగ వచ్చేస్తుంటుంది ఈ రోజుల్లో.! పై గాసిప్పు నిజమా.? కాదా.? అన్నది ‘గుంటూరు కారం’ సినిమా రిలీజ్ తర్వాత ఓ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే, ఆ యంగ్ హీరో కూడా, ‘గుంటూరు కారం’ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడట మరి.!