ఆ రియాక్షన్ త్వరలోనే చూస్తారు.. బన్నీ అరెస్టుపై రచయిత చిన్ని కృష్ణ కామెంట్స్!

సంధ్య థియేటర్ దగ్గర జరిగిన సంఘటన కారణంగా చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే మద్యంతర బెయిల్ రావటంతో శనివారం పొద్దున్న అల్లు అర్జున్ విడుదలై ఇంటికి చేరుకున్నారు. అయితే బెయిల్ రాత్రే వచ్చినప్పటికీ పొద్దున్న విడుదల కావటం పట్ల చాలామంది దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ వాళ్ళు అల్లు అర్జున్ అరెస్టు అక్రమం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కధా రచయిత చిన్ని కృష్ణ అయితే గీతా కార్యాలయానికి వెళ్లి బన్నీని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ యావత్ భారతదేశం మొత్తం దుఃఖంలో ఉందని, ఆ రియాక్షన్ ఏమిటో త్వరలో చూస్తారని చెప్పారు. ఆయనని కావాలనే అరెస్టు చేశారు ఆ అరెస్టు అన్యాయం, అక్రమం అని పేర్కొన్నారు. ఈ అరెస్టును ఎవరు సహించేది లేదు, ఇంతకంటే నీచమైన నికృష్టమైన అరెస్టు భూమండలం మీద జరగలేదని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ పై చట్టపరంగా పెట్టిన ప్రతి సెక్షన్ కూడా తప్పు అని చెప్పిన చిన్ని కృష్ణ రాజకీయ సభల సందర్భంగా సినిమాల ఫంక్షన్స్ సందర్భంగా చాలా సందర్భాలలో చాలామంది మృతి చెందారు, ఇంద్ర సినిమాకి తాను పనిచేశానని ఆ సమయంలో కూడా కొందరు మరణించారని గుర్తు చేశారు. అలాగే అన్ని సినిమాలకి ఇచ్చినట్లే పుష్ప టు సినిమాకి కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, అంతేగాని ఈ సినిమాకి ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు అని చెప్పారు చిన్నికృష్ణ.

బన్నీకి అరెస్ట్ మరక అంటించిన ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైనా సర్వనాశనమవుతాడని శాపనార్ధాలు పెట్టారు. ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసు అని విమర్శించారు. అంతేకాకుండా అల్లు అర్జున్ అంటే తనకు ప్రాణం అని, అతని మొదటి సినిమా గంగోత్రి కి కథ అందించింది తానే అని, బన్నీ అరెస్ట్ అయిన దగ్గరనుంచి అన్నం కూడా తినలేదని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ భారత చలనచిత్ర పరిశ్రమకు ఒక విలువైన ఆస్తి వంటి వాడిని చెప్పారు.

Allu Arjun ను అరెస్టు చేయడం నీచం.. Chinni Krishna ఫైర్| FilmiBeat Telugu