ప్రియుడితో కలిసి రచ్చ చేసిన శృతిహాసన్.. వీడియో!

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటి శృతిహాసన్. ఈమె ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన శృతిహాసన్ క్రాక్ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన హిట్ అందుకున్నారు. ఇలా రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో అగ్ర హీరోలందరి సరసన నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉండే శృతిహాసన్ సోషల్ మీడియాలో కూడా ఎంత యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే ఈమె నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడమే కాకుండా తన ప్రియుడు శంతను హాజరిక గురించి కూడా ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈమె హజారికాతో ప్రేమలో ఉండటమే కాకుండా ఆయనతోపాటు సహజీవనం చేస్తున్నారు. ఇలా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన శృతిహాసన్ తనకు సంబంధించిన అన్ని విషయాల గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంటారు.

సోషల్ మీడియా అనేది తన జీవితంలో అభిమానులకు మరింత దగ్గర చేయడానికి ఓ గొప్ప మార్గం అంటూ ఈమె ఎన్నోసార్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే తాజాగా తన ప్రియుడితో కలిసి దిగిన సెల్ఫీ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నువ్వు ఎప్పటికీ నాకు ఒక విచిత్రమే అంటూ క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె సినిమాల విషయానికొస్తే ప్రభాస్ సరసన సలార్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే బాలకృష్ణ చిరంజీవి వంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం అందుకున్నారు.