నీ గురించి నీకు తెలియదు సామ్… సమంత పై వెంకీ కూతురు కామెంట్స్?

టాలీవుడ్ నటి, అక్కినేని మాజీ కోడలు సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె ఈ ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇలా తాను ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్య గురించి సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు సమంత అనారోగ్యంపై స్పందిస్తూ ఆమె త్వరగా కోలుకోవాలని క్షేమంగా బయటకు రావాలంటూ పోస్టులు చేయడమే కాకుండా తనలో మనోధైర్యాన్ని నింపుతున్నారు.

ఈ క్రమంలోనే సమంత అనారోగ్య సమస్యల గురించి తెలియడంతో ఎన్టీఆర్, అఖిల్, సుశాంత్, సాయి ధరమ్ తేజ్, చిరంజీవి,పలువురు నటీమణులు కూడా సోషల్ మీడియా వేదికగా సమంతకు ధైర్యాన్ని నింపుతూ పోస్టులు చేస్తున్నారు.ఇక ఈమె వ్యాధి గురించి తెలియడంతో అక్కినేని అఖిల్ ముందుగా స్పందించారు. ప్రస్తుతం దగ్గుబాటి కుటుంబ సభ్యులు కూడా సమంత అనారోగ్యం పై స్పందిస్తూ కామెంట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత సమంత అనారోగ్యంపై స్పందిస్తూ కామెంట్లు చేశారు. ఈ సందర్భంగా సమంత చేసిన పోస్ట్ పై ఆశ్రిత స్పందిస్తూ… నీ గురించి నీకు తెలియదు సమంత నీలో నీకు తెలియనంత శక్తి దాగి ఉంది అనంతమైన ప్రేమ నీకు పంపిస్తున్న అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా సమంతకు ధైర్యాన్ని నింపుతూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆశ్రిత చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. ఇక సమంత నాగచైతన్యతో విడిపోయినప్పటికీ ఆశ్రిత సమంత మధ్య మంచి బాండింగ్ ఉందని చెప్పాలి.