కేజీఎఫ్ స్టార్ హీరో కుమారుడి బ‌ర్త్ డే వేడుక‌.. జూనియ‌ర్ రాఖీని చూసి మురిసిపోతున్న ఫ్యాన్స్

క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ స్థాయిని రెట్టింపు చేసిన చిత్రం కేజీఎఫ్‌. బంగారు గ‌నుల నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కించ‌గా, ఇందులో య‌శ్ ప్ర‌ధాన పాత్ర పోషించాడు. రాఖీ భాయ్ అనే పాత్ర‌లో య‌శ్ ప‌ర్‌ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల చేత ఈలలు వేయించింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ సునామి సృష్టించిన ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతుంది. వ‌చ్చే ఏడాది విడుద‌ల కానున్న ఈ సినిమాలో సంజ‌య్ ద‌త్ అధీరా అనే పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ర‌వీన్ టాండన్, రావు ర‌మేష్ వంటి ప్ర‌ముఖులు ఇందులో ముఖ్య పాత్రలు పోషించ‌నున్నారు.

బాహుబ‌లి సినిమాతో ప్ర‌భాస్ స్థాయి ఏ రేంజ్ లో పెరిగిందో, కేజీఎఫ్ చిత్రం కూడా య‌శ్‌కు అంతే గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో య‌శ్ నేష‌న‌ల్ స్టార్ అయ్యాడు. ప‌లువురు బాలీవుడ్ డైరెక్ట‌ర్స్ అతనితో మూవీస్ ప్లాన్ చేస్తున్నారు. అయితే య‌శ్ సినిమాల‌తో పాటు త‌న ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వ‌డం ఆయ‌న‌పై గౌర‌వాన్ని మ‌రింత పెంచింది. త‌న సోష‌ల్ మీడియా ద్వారా త‌ర‌చు కుమారుడు లేదా కూతురి ఫోటోల‌ని షేర్ చేస్తారు. లేదంటే ఇంట్లో జ‌రిగిన వేడుక‌ల‌కి సంబంధించిన వీడియోల‌ని పోస్ట్ చేస్తూ నెటిజ‌న్స్‌కి మంచి వినోదాన్ని అందిస్తూ ఉంటారు.

యశ్‌..రాధికని 2016లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి కూతురు ఐరా, కొడుకు య‌ధ‌ర్వ్ య‌శ్ అనే‌ ఉన్నారు. అక్టోబ‌ర్ 30,2019న వీరికి య‌ధ‌ర్వ్ య‌శ్ అనేజ‌న్మించ‌గా, మే 1న తొలిసారి కుమారుడి ఫోటోని షేర్ చేశారు. సెప్టెంబ‌ర్‌లో కుమారుడి నామ‌క‌ర‌ణం జ‌రిపించిన ఈ దంప‌తులు రీసెంట్‌గా కుమారుడి ఫ‌స్ట్ బ‌ర్త్‌డేని కుటుంబ స‌భ్యుల మధ్య‌జ‌రిపించారు. ఆ సెల‌బ్రేష‌న్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ని రాధికా రీసెంట్‌గా త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా ఇవి వైర‌ల్‌గా మారాయి.