సమంత సినీమాలో అనుష్క.. క్లారిటీ ఇచ్చిన నిర్మాత?

అందాల నటి అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమా ద్వారా అనుష్క తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. అరుంధతి సినిమా ద్వారా మరింత పాపులర్ అయ్యింది. ఇక రాజమౌలి దర్శకత్వం వహించిన బాహుబలి సినిమాలో అనుష్క రెండూ పాత్రలలో నటించింది. అనుష్క ఎక్కువగా నటనకి ప్రాధాన్య ఉన్న పాత్రలలో నటిస్తూ..స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే కొంత కాలం నుండి అనుష్క సినిమాలకి దూరంగా ఉంది. నిశబ్దం సినీమా తర్వాత అనుష్క మళ్లీ బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు.

ఇదిలా ఉండగా తాజాగా అనుష్క గురించి ఇండస్ట్రీలో ఒక వార్త వినిపిస్తోంది. సమంతతో కలిసి అనుష్క ఒక సినిమాలో నటిస్తోందని వార్తలు వైరల్ అవుతున్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటిస్తున్న సినిమా శాకుంతలం. పౌరాణిక గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గుణశేఖర్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అంతే కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా మొదటిసారి చైల్డ్ ఆర్టిస్టుగా ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.

అయితే ఈ సినిమాలో సమంతతో కలిసి అనుష్క కూడ కీలక పాత్రలో నటించిందని. ఇప్పటికే వీరిద్దరికీ సంబందించిన షూటింగ్ కూడా పూర్తయింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నీలిమ గుణ ఈ వార్తల గురించి స్పందించి క్లారిటీ ఇచ్చారు. అనుష్క ఈ సినిమాలో నటించలేదు. కానీ, మాతోనే ఉంటూ మాకు తన సహాయాన్ని అందిస్తున్నారని క్లారిటీ ఇచ్చారు. శాకుంతలం సినిమాలో సమంతతో పాటు అనుష్క నటిస్తుందనే వార్తల్లో నిజం లేదని నీలిమ తేల్చి చెప్పింది. అయితే అనుష్కని తెర మీద చూసి చాలా కాలం అవటంతో ఆమె అభిమానులు ఆమెను చూడటానికి ఆత్రుత కనబరుస్తున్నారు.