యశోద సక్సెస్.. ఇది నాకు గొప్ప బహుమతి అంటూ సమంత ఎమోషనల్ పోస్ట్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత విడాకుల తర్వాత మొదటిసారిగా ఆమె నటించిన యశోద సినిమా నవంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 11వ తేదీ విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్ల పరంగా మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది.ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో సమంత సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.

ఈ సందర్భంగా సమంత యశోద సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నన్ను నమ్మి ఈ కథను నాకు అందించిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సినిమా పట్ల ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరాభిమానాలు నాకు గొప్ప బహుమతి.ఈ సినిమాని థియేటర్ లో మీరు ఎంతగా ఆనందిస్తున్నారో చూస్తున్నాను అలాగే ఈ సినిమా మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేసిందో మీ మాటల ద్వారా విన్నాను.

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో నేను గాల్లో తేలిపోతున్నాను.ఈ సినిమా విషయంలో నన్ను నమ్మి ఈ అవకాశం నాకు కల్పించిన నిర్మాత కృష్ణ ప్రసాద్ అలాగే దర్శకులు హరి హరీష్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ ఈ సందర్భంగా సమంత యశోద సినిమా గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.అయితే సమంత మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుండగా ఈ సినిమా కోసం ఎంతగానో కృషి చేశారని తెలుస్తోంది. ఈ వ్యాధితో బాధపడుతూనే డాక్టర్ పక్కన పెట్టుకొని మరి డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు. సినిమా పట్ల ఇంత డెడికేషన్ చూపిస్తున్న సమంతకు ఇది నిజమైన విజయం అని చెప్పాలి.