KGF 2 : ముంబై లో యష్ క్రేజ్ మాములుగా లేదుగా.. అభిమానుల సందడి చూసి ఆశ్చర్య పోయిన బాలీవుడ్…!

KGF2: యష్ నటించిన ‘కెజిఎఫ్2’ ఏప్రిల్ 14న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ కి రెడీ అవుతోంది. యష్ నటించిన కేజిఎఫ్ ఎంత భారీ విజయాన్ని అందుకున్న అందరికీ తెలిసిందే, సీక్వెల్ గా వస్తున్న కేజిఎఫ్ 2 మీద కూడా అంచనాలు అంతే రేంజ్ లో ఉన్నాయి. ఇక తూఫాన్ సాంగ్ విడుదల చేసిన తర్వాత యూట్యూబ్ లో ఇక తూఫాన్ మొదలయింది.హోంబలే ఫిలింస్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.బాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్‌లో అంత పెద్ద సక్సెస్ అయిన చిత్రమదే.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కి అనూహ్య స్పందన వచ్చింది.కర్ణాటక రాష్ట్రంలో కె.జి.యఫ్ 2 సినిమా రూ.180 కోట్ల మేరకు ప్రీ రిలీజ్ బిజినెస్‌ను జరుపుకుందట. ఇంత మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న చిత్రం ఇదే అవ్వడం విశేషం. అంతే కాదు కేజీఫ్ 2 తెలుగు వెర్షన్ ప్రీ రిలీజ్ బిజినెస్ భీమ్లా నాయక్ సినిమా బిజినెస్ ను అడిగామించింది అని వార్తలు వచ్చాయి.విడుదల సమయం దగ్గర పడుతుందటం తో చిత్ర బృందం ప్రమోషన్ లను గట్టిగ మొదలు పెట్టింది.

తాజాగా హిందీలో ప్రమోషన్స్ కి చిత్ర యూనిట్ వెళ్లగా రాకీ భాయ్ యష్ రాకకి అక్కడ మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.అక్కడ ఒక మాల్ లో ప్రమోషన్స్ కి యష్ వెళ్లగా అక్కడి ప్రాంగణం అంతా జనంతో నిండిపోయింది. దీనితో ఈ మాసివ్ రెస్పాన్స్ ని చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు షేర్ చేసి తెలియజేసారు.యష్‌కి వస్తున్న క్రేజ్ చూసి ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.