Yash : కేజీఎఫ్ తో ఓవర్ నైట్ స్టార్ అయిన యష్ కేజీఎఫ్ కి ముందు తన సినీ జీవితం గురించి, అనుభవాలను పంచుకున్నారు. కన్నడ చిత్ర సీమకే పరిమితమైన యష్ ను ఇండియా మొత్తం చూసేలా చేసింది మాత్రం కేజీఎఫ్ చాప్టర్ 1 సినిమా. ఈ సినిమా అసలైన పాన్ ఇండియన్ సినిమా ఏ మాత్రం ప్రచారం లేకపోయినా సూపర్ హిట్ అయింది. అందులో నటించిన వారికి క్రేజ్ తెచ్చింది.ఇక ఇపుడు రాకీబాయ్ అంటే నార్త్, సౌత్ తేడా లేకుండా అభిమానులు ఉన్నారు.
ఇక యష్ తన కేజీఎఫ్ ముందు కెరీర్ ను మీడియాతో పంచుకున్నారు.మైసూరులో ఐదో తరగతి చదువుతున్న సమయంలో టీచర్ పెద్దయ్యాక ఏమవుతావని అడిగితే హీరోనవుతానని తాను చెప్పానని యశ్ చెప్పుకొచ్చారు. క్లాసులోని మిగతా పిల్లలు నవ్వినా నా లక్ష్యం మాత్రమే మారలేదని చెప్పారు. సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించిన తాను సక్సెస్ కోసం తాను చాలా కష్టపడ్డానని యశ్ వెల్లడించారు. 15 సంవత్సరాల వయస్సులో 300 రూపాయలు తీసుకుని బెంగళూరు పారిపోయానని యశ్ పేర్కొన్నారు. బెంగళూరుకు వెళ్లాక తనకు భయం వేసిందని నాటకాలు వేసి వచ్చిన డబ్బుతో జీవనం సాగించానని యశ్ వెల్లడించారు.
నందగోకుల అనే సీరియలో అవకాశం తో సీరియల్స్ లో నటించడం మొదలుపెట్టానని ఆ తర్వాత ఐదు సీరియల్లలో హీరోగా చేసానని ఆ తర్వాత రాకీ సినిమాతో వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదని చెప్పారు. తనతో హీరోయిన్ గా చేసిన గీతను వివాహం చేసుకున్నారు యష్.ఇక తాను అచ్చం రామ్ చరణ్ లా ఉన్నానని చాలామంది చెప్పారని పాత ఫోటోలు చూస్తే తనకు అలా అనిపించిందని చెప్పారు. ఇక యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ జోతిష్యులు య అక్షరంతో పేరు మార్చుకోమనడంతో జాతకం ప్రకారం యష్ అని పెట్టుకున్నారట. ఇక యష్ మొదటి సినిమా మొగ్గిన మనసులు ఈ సినిమా ద్వారా రాకీ భాయ్ వెండి తెర పై అడుగుపెట్టాడు.