రాకీ భాయ్‌తోనే పరాచకాలా?.. యశ్‌ను ఎంతలా విసిగించిందో చూడండి.. వీడియో వైరల్

Yash Playing WIth Her Daughter

రాకీ భాయ్ అంటే దేశవ్యాప్తంగా ఓ సంచలనం. కేజీయఫ్ సినిమాతో రాకీ భాయ్‌గా యశ్ కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అప్పటి వరకు కన్నడ చిత్రసీమకే పరిమితమైన యశ్ క్రేజ్ నేషనల్ వైడ్‌గా పాకింది. ఇప్పుడు రాకీ భాయ్ అన్నా, యశ్ అన్నా ఓ బ్రాండ్. కేజీయఫ్ సృష్టించిన సంచలనాలకు ధీటుగా ఉండేలా చాఫ్టర్ 2ను రెడీ చేస్తోన్నారు. ఈ మూవీని అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

కేజీయఫ్‌కు మించి ఈ సీక్వెల్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో అధీరాగా అతి క్రూరమైన పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ కూడా బాగా వైరల్ అయింది. యశ్ ఫస్ట్ లుక్ బాగానే క్లిక్ అయింది. కోవిడ్ వల్ల క్యాన్సిల్ అయిన షూటింగ్ ఈ మధ్యే ప ప్రారంభమైంది. ప్రస్తుతం రాకీ భాయ్ షూటింగ్‌లోనే ఉన్నాడు. అయితే దసరా పండుగ సందర్భంగా కాస్త గ్యాప్ తీసుకున్నట్టు కనిపిస్తోంది.

Yash Playing WIth Her Daughter
Yash Playing WIth Her Daughter

యశ్ ఫ్యామిలీతో ఎంతో సమయాన్ని కేటాయిస్తాడు. ఇద్దరు పిల్లలను ఎంతో ముద్దాడుతాడు. తాజాగా తన కుమారుడి బారసాల వేడుకను ఇంటి సభ్యుల మధ్యే ఘనంగా నిర్వహించాడు. అయితే యశ్ కూతురు మాత్రం ఎంతో అల్లరి పిల్ల. ప్రతీసారి యశ్‌ను ఆటపట్టిస్తూనే ఉంటుంది. యశ్, యశ్‌తో పిల్లలు చేసే అల్లరి సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. యశ్‌ని తన కూతురు ఓ రేంజ్‌లో ఆట పట్టించింది. స్పూన్‌తో తింటూ ఉన్న కూతురిని తనకు కూడా పెట్టమని అడిగాడు. కానీ ఆ చిన్నారి పెడుతున్నట్టే యాక్షన్ చేసి తానే తినేస్తోంది. ప్రతీసారి అలా యశ్‌ను ఆటపట్టిస్తూనే వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.