Rajamouli: టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్.ఎస్. రాజమౌళిపై ఇటీవల సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఆయన స్నేహితుడు, మాజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉప్పలపాటి శ్రీనివాసరావు చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. రాజమౌళి టార్చర్ భరించలేక తాను ఆత్మహత్య చేసుకోవాల్సిన స్థితికి వచ్చానంటూ శ్రీనివాసరావు ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేయడం, లేఖ రాయడం కలకలం రేపింది. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం? ఈ వివాదం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి అనే విషయంపై ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి.
34 ఏళ్ల స్నేహం ఉందని చెప్పుకుంటున్న శ్రీనివాసరావు, రాజమౌళి యమదొంగ సినిమాలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశాడు. అయితే, ఆ తర్వాత ఆయనను ఇండస్ట్రీలో నుంచి పూర్తిగా దూరం చేశారని, కారణం గతంలో ముగ్గురి మద్య జరిగిన ట్రయాంగిల్ లవ్ స్టొరీ అని, ఆ మహిళ వివాదం వల్లే ఇప్పటికి టార్చర్ పెడుతున్నట్లు ఆరోపించారు. ఆ విషయం బయటకు చెబుతానేమో అని నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు అంటూ.. రాజమౌళి వ్యక్తిగత జీవితం వల్ల తన జీవితమే నాశనమైపోయిందని, ఆయన తాను ఎదిగేలా చూసుకున్నాడే కానీ, తన గురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఆరోపించారు.
https://x.com/bigtvtelugu/status/1895006441842581842?s=48
అంతేకాదు, తాను 54 ఏళ్ల వయసులో కూడా బ్యాచిలర్‌గా ఉండటానికి కారణం రాజమౌళేనని, తనను ఇండస్ట్రీ నుంచి తొలగించేందుకు కుట్ర పన్నాడని ఆరోపించారు. ఇక ఈ లేఖలో మరింత షాకింగ్ అంశం ఏమిటంటే, రాజమౌళి తాను ఇండస్ట్రీలో నెంబర్ వన్‌గా ఎదగడానికి ఇతర దర్శకులకు వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేశాడని ఆరోపించారు. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు బయటకు రాలేదు. ఒకవేళ ఇది నిజమైతే, టాలీవుడ్‌లో పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది. శ్రీనివాసరావు పోలీసులకు సుమోటో కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేయడంతో, ఈ వివాదం ఇంకా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
మొత్తానికి ఈ ఆరోపణలు ఎంతవరకు నిజం? శ్రీనివాసరావు చెప్పిన విషయాల్లో ఎంతవరకు నిజం ఉందనే ప్రశ్నలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాజమౌళి ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ SSMB29 పనుల్లో బిజీగా ఉండగా, ఈ వివాదం ఒక్కసారిగా పెద్దగా మారింది. మరి, దీనిపై రాజమౌళి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.