టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి గురించి అందరికీ సుపరిచితమే.ఈమె నటి కాకపోయినా హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అలాగే తన పిల్లల విషయాలను షేర్ చేస్తూ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ సొంతం చేసుకున్నారు.ఇకపోతే స్నేహ రెడ్డి నిత్యం విభిన్నమైన వస్త్రధారణతో ఫోటోషూట్లు జరిపి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తాజాగా అల్లు అర్జున్ స్నేహితుడు వివాహం నిమిత్తం సౌత్ ఆఫ్రికా వెళ్ళిన సంగతి తెలిసిందే. ఇలా సౌత్ ఆఫ్రికాలో ఈ జంట తమ స్నేహితుడి వివాహ వేడుకలలో పెద్ద ఎత్తున సందడి చేశారు. అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డి ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక వివాహ సమయంలో అల్లు స్నేహ ఎంతో స్టైలిష్ లుక్ లో కనిపించి సందడి చేశారు. ముఖ్యంగా ఈమె ధరించిన డ్రెస్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
ముంబైకి చెందిన ప్రముఖ డిజైనర్ అనిత డిజైన్ చేసిన లారా లెహంగా ధరించినటువంటి స్నేహ రెడ్డి పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఈ విధంగా పెళ్లిలో సరైన అవుట్ ఫిట్ ధరించి ఎంతో అందంగా ఉన్నటువంటి స్నేహ రెడ్డికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా స్నేహారెడ్డి ధరించిన ఈ డ్రెస్ ఖరీదు గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పెళ్లిలో స్నేహ రెడ్డి ధరించిన ఈ డ్రెస్ 1.5 లక్షల రూపాయలు కావడంతో ఈ డ్రెస్ ఖరీదు తెలిసే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.