రజినీ దెబ్బ..3డేస్ లో “జైలర్” సెన్సేషనల్ కలెక్షన్స్!

లేటెస్ట్ గా సౌత్ ఇండియా సినిమా దగ్గర వచ్చిన ఓ క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం “జైలర్”. మరి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం మొదట్లో తక్కువ బజ్ లోనే ఉన్నప్పటికీ ట్రైలర్ ఇతర అప్డేట్స్ తో అయితే సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని ప్రపంచ వ్యాప్తంగా కొల్లగొట్టిన ఈ చిత్రం.

ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 3 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ మూడు రోజుల్లో అనేకమంది స్టార్స్ అందుకోలోనే రేంజ్ రికార్డు వసూళ్లు రజిని దెబ్బకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాగా ఈ చిత్రం వరల్డ్ వైడ్ మూడు రోజుల్లో అయితే ఏకంగా 220 కోట్ల మాసివ్ గ్రాస్ ని అందుకుంది అట.

ఇది మాత్రం మామూలు విషయం కాదని చెప్పాలి. అలాగే రజిని కం బ్యాక్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అయితే ఇందులో మేజర్ గా తమిళ్ తెలుగు, కర్ణాటక సహా యూఎస్ మరియు అరబ్ దేశాల్లో భారీ వసూళ్లు నమోదు కావడంతో జైలర్ ఇంత ఫాస్ట్ గా ఈ వసూళ్లు కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది.

ఇక లాంగ్ రన్ లో అయితే చాలా రికార్డులు తమిళ నాట లేచిపోతాయి అని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి రజినీ వేట ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి. కాగా ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా తమన్నా సునీల్ లు ముఖ్య పాత్రల్లో నటించారు అలాగే మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ కన్నడ స్టార్ హీరో శివన్న గెస్ట్ రోల్స్ లో నటించి సినిమాకి అదనపు బలం చేకూర్చారు.