బాక్సాఫీస్ : వరల్డ్ వైడ్ “అవతార్ 2” రికార్డు బిజినెస్ ఎంతంటే.!

వరల్డ్ సినిమా టాప్ మోస్ట్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “అవతార్ 2”. ప్రపంచ ఆడియెన్స్ అంతా ఈ భారీ విజువల్ వండర్ ని త్వరగా థియేటర్స్ లో విట్నెస్ చెయ్యాలని చూస్తున్నారు. అయితే సరిగ్గా పదమూడేళ్ళ కిందట అవతార్ మొదటి సినిమా అయితే..

అప్పట్లో 1400 నుంచి 1500 కోట్ల మధ్యలో బడ్జెట్ తో తెరకెక్కగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ ఈ సినిమా 2.7 బిలియన్ డాలర్స్ గ్రాస్ వసూళ్లతో నెంబర్ 1 హాలీవుడ్ గ్రాసర్ గా నిలిచింది. ఇక ఇపుడు రాబోతున్న సీక్వెల్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకు మించే బడ్జెట్ తో తెరకెక్కగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బ్రేకీవెన్ ఫిగర్ ఎంత అనేది ఇప్పుడు తెలుస్తుంది.

మరి లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే అవతార్ 2 ఓవరాల్ గా అన్ని దేశాల్లో కలిపి 2 బిలియన్ మేర కేవలం థియేట్రికల్ బిజినెస్ ని జరుపుకుందట. అంటే మళ్ళీ అవతార్ అప్పట్లో వసూళ్లు చేసిన రేంజ్ లో బిజినెస్ ని జరిపిందట.

అయితే ఈ సినిమాపై ఉన్న అంచనాలకి హిట్ టాక్ వస్తే రికార్డు లెవెల్లో వసూళ్లు ఉంటాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అయితే మరోపక్క దర్శకుడు ఒకవేళ అవతార్ 2 ప్లాప్ అయితే తన నెక్స్ట్ సినిమాలు ఆపేస్తానని చెప్పడం తెలిసిందే.