ఉమెన్స్ డే స్పెషల్ .. ‘వ‌కీల్ సాబ్’ కొత్త‌ పోస్టర్ విడుద‌ల !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తాజాగా నటిస్తున్న చిత్రం ‘వకీల్ సాబ్’.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తొలిసారి వకీల్ పాత్రలో అలరించనున్నాడు. ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్.

 

శ్రీరామ్ వేణు పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు ఈ చిత్రంలో కొన్ని కీలక మార్పులు చేసారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు.‌ ఈ రోజు ఉమెన్స్ డే సందర్భంగా ‘వకీల్ సాబ్’ నుంచి మరో పోస్టర్‌ను విడుదల చేసారు. ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు అంజలి, అనన్య, నివేదా థామస్‌తో కలిసి ఉన్న ఫోటోను విడుదల చేసారు.

నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్రల్లో ఉన్న ఈ పోస్టర్ అల‌రిస్తుంది. వారు ముగ్గురు త‌న‌ వెన‌క నిల‌బ‌డ‌గా మ‌హిళ‌ల‌ను ర‌క్షించే లాయ‌ర్‌లా ప‌వ‌న్ క‌ల్యాణ్ కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఓ చేతిలో బేస్ బాల్ బ్యాట్, మ‌రో చేతిలో న్యాయ‌శాస్త్ర పుస్త‌కం ప‌ట్టుకుని సీరియ‌స్ లుక్‌లో క‌నప‌డుతున్నారు.మహిళ ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. ముఖ్యంగా మూడేళ్ళ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో వకీల్ సాబ్‌పై అంచనాలు పెంచేస్తుంది. బిజినెస్ కూడా 100 కోట్ల వరకు జరుగుతుంది. గ‌త ఏడాది మార్చి 8న కూడా మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా ఈ సినిమా నుంచి ‘మ‌గువా.. మ‌గువా’ అనే పాట విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సారి ఈ సినిమా పోస్ట‌ర్ ద్వారా ఆ చిత్ర బృందం అల‌రించింది. ఈ రోజు మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ సినిమాలోని ‘మ‌గువా.. మ‌గువా’ పాట మ‌రోసారి మారుమోగిపోతోంది. ఈ సినిమా ఏప్రిల్ 9న విడుద‌ల కానుంది.