కరోనా కల్లోలం వలన దాదాపు ఏడు నెలల పాటు షూటింగ్స్ అన్నీ బంద్ అయ్యాయి. ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు కాగా, వీలైనంత తొందరగా చిత్ర షూటింగ్స్ పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ నుండి థియేటర్స్ కూడా తెరచుకోనున్నట్టు తెలుస్తుంది. సమయానుకూలంగా ఒక్కో సినిమాని రిలీజ్ చేస్తూ ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేయనున్నారు నిర్మాతలు.
బాహుబలి సినిమా తర్వాత తెలుగులో మళ్లీ అంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బేనర్‌పై డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో మూవీని నిర్మిస్తున్నాడు. ఎన్టీఆర్. రామ్ చరణ్, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలలో రూపొందుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. బ్రేక్ లేకుండా మూవీ చిత్రీకరణ జరుపుతున్నారు. ఓ వైపు చలి గజగజ వణికిస్తున్నప్పటికీ షూటింగ్ ఆపడం లేదు. తాజాగా ఆర్ఆర్ఆర్ టీం చలితో ఇబ్బంది పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
కరోనాకి ముందు 70 శాతం షూటింగ్ పూర్తి కాగా, మిగతా పార్ట్‌ని ఈ రెండు నెలలో పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ అట. వచ్చే ఏడాది సమ్మర్ వరకు చిత్రాన్ని తప్పక రిలీజ్ చేస్తామని మేకర్స్ అంటున్నారు. షూటింగ్ పూర్తి అయిన వెంటనే ప్రమోషనల్ కార్యక్రమాలపై దృష్టి పెట్టనున్నారు. షూటింగ్ విషయంలో ఏ మాత్రం ఏ మాత్రం అశ్రద్ధ చేయని చిత్ర బృందం ప్రమోషన్స్‌ని కూడా భారీ రేంజ్‌లో చేయనున్నట్టు తెలుస్తుంది. బాహుబలిని మించి ఈ చిత్రం రికార్డులు బ్రేక్ చేసేలా మూవీని రూపొందిస్తున్నారు.
No one can escape the cold winds with out these on set heaters 🔥
Throwback to last week’s midnight shoots! #RRRDiaries #RRRMovie pic.twitter.com/bFmYqC9low
— RRR Movie (@RRRMovie) November 16, 2020