ఆ సినిమా బాహుబలి ని మించి కలెక్ట్ చేస్తుందా?

తెలుగు సినిమా కె కాదు ఇండియన్ సినిమా కి ‘బాహుబలి’ ఒక బెంచ్ మార్క్. రెండు పార్ట్ లుగా వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. చాలా మంది ‘బాహుబలి’ లా సినిమాలు తియ్యాలని ప్రయత్నించి విపయల్యమయ్యారు. అంతెందుకు, రాజమౌళి తీసిన ‘RRR ‘ కూడా ‘బాహుబలి’ ని మించలేదు.

అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న ‘పొన్నిసెల్వన్’ సినిమా ‘బాహుబలి’ రికార్డ్స్ ని బద్దలుగొడుతుందని ఆ టీం గట్టి నమ్మకం తో ఉంది. మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయి, త్రిష, జయం రవి లాంటి భారీ స్టార్ క్యాస్ట్ ఉంది. అలాంటి ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో జరిగింది. ఈ స్టేజ్ పై కార్తి మాట్లాడుతూ .. “సినిమా ఎంత గొప్ప మీడియం అనేది ఇలాంటి పెద్ద సినిమాలు చేసినప్పుడే గుర్తుకు వస్తుంటుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే  ఇది మణిరత్నంగారి 40 ఏళ్ల కల. అందరూ కూడా ఈ సినిమా ‘బాహుబలి’లా ఉంటుందా? అని అడుగుతున్నారు. ‘బాహుబలి’ సినిమాను మనం చూశాము .. మనకి నచ్చింది. ఇంకో ‘బాహుబలి’ మనకి అవసరమే లేదు. ఈ భూమ్మీద ఎన్నో కథలు ఉన్నాయి .. ఎంతోమంది హీరోలు ఉన్నారు. అలాంటి ఒక ఆసక్తికరమైన  కథ ఇది.

70 ఏళ్లుగా బెస్ట్ సెల్లార్ గా ఉన్న ఒక నవలను మణిరత్నం సార్ ఈ సినిమాగా తీయడం జరిగింది. ఈ సినిమా కోసం ఇంతమంది స్టార్స్ తో కలిసి పనిచేయడం గొప్ప అవకాశంగా .. అదృష్టంగా నేను భావిస్తున్నాను.

ఈ సినిమాలో రొమాన్స్ .. అడ్వెంచర్ .. ఆనాటి రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. రామాయణ .. మహాభారతాల్లో మాదిరిగా విభిన్నమైన పాత్రలు ఈ సినిమాలో ఉన్నాయి. ఇక నేను ఏ ఆర్ రెహ్మాన్ గారి అభిమానిని. ‘నువ్వు కళను ఫాలో అయితే ప్రపంచం నిన్ను ఫాలో అవుతుంది’ అని ఆయన చెప్పిన మాటనే నేను ఫాలో అవుతున్నాను.

ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలవుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారికీ .. దిల్ రాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాకి సంబంధించి తెలుగు డైలాగ్స్ చెప్పడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎన్టీఆర్ ను గుర్తుచేసుకుని ఆ డైలాగ్స్ ను చెప్పాను. ఆయన ఎన్నో చారిత్రక చిత్రాలు చేశారు గనుక భయపడుతూనే ఈ సినిమాను చేశాను. ఈ సినిమాను మీరంతా ఆదరిస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇండియా లోనే టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం చాన్నాళ్ల నుండి హిట్ ఇవ్వలేదు. భారీ అంచనాల మధ్య విడుదలయిన ‘రావణ్’, ‘నవాబ్’ సినిమాలు అంత గా ఆడలేదు. మొదటి సారి పీరియడ్ సినిమా తీస్తున్న మణిరత్నం ఈ సారి హిట్ అందుకుంటాడా లేదో చూడాలి.