ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో పుష్పరాజ్ పాత్ర చేసినందుకు గాను రాష్ట్రపతి నుండి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకోనున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
‘పుష్ప’ సినిమాకి సీక్వెల్ గా ‘పుష్ప 2’కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండో పార్టు వచ్చే సంవత్సరం ఆగస్ట్ 15న విడుదల అవుతుందని ముందుగానే ప్రకటించారు. ఇదిలా ఉండగా, దర్శకుడు సుకుమార్, కథానాయకుడు అల్లు అర్జున్ ఈ సినిమా గురించి ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఒక వార్త వినపడుతుంది. అదేంటి అంటే ఈ సినిమా రెండు పార్టులతోటే కాదు, ‘పుష్ప 3’ మూడో పార్టు కూడా ఉంటుంది అని.
ఈ కథని చెప్పాలంటే రెండు పార్టులు సరిపోవు, అందుకని మూడో పార్టు కూడా తీయబోతున్నాం అని రెండో పార్టు చివర్లో చెప్తారు అని తెలిసింది. అయితే ఈ మూడో పార్టు మాత్రం వెంటనే ఉండదు అని అంటున్నారు. ఎందుకంటే ‘పుష్ప 2’ తరువాత అల్లు అర్జున్ వేరే సినిమాలు ఒకటి రెండు చేసి, ఆ తరువాత మూడో పార్టుకు రావచ్చు అని తెలిసింది.
సుకుమార్ కూడా వేరే వాళ్ళతో ఒక సినిమా చేసాక మళ్ళీ తరువాత ‘పుష్ప 3’ కోసం వస్తారు అని తెలిసింది. ఈ కథలో చాలా లోతు ఉందని, అందుకని ఎన్ని పార్టులైనా తీయొచ్చు అని, ఇప్పుడు చాలా సినిమాలు మూడు పార్టులుగా కూడా తీస్తున్నారు, అందుకని ‘పుష్ప 3’ కూడా ముందు ముందు ఉంటుందని వార్తలు వస్తున్నాయి.