‘ఓజీ’ తాజా గ్లింప్స్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. ఈ రెస్పాన్స్ చూసి, ఉన్నపళంగా రీమేకులు ఆపేసి, ఒరిజినల్ సినిమాలు చేయమని పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్ సూచిస్తున్నారట.
అది కూడా హరీష్ శంకర్‌తో చేయబోయే సినిమా మానేయమంటున్నారు. మొదట హరీష్ శంకర్‌తో పవన్ చేయబోయే సినిమా స్ట్రెయిట్ సినిమానే. అయితే, అత్యవసర సరిస్థితుల్లో రీమేక్ మూవీ ‘తెరి’ని తెరపైకి తీసుకురావల్సి వచ్చింది.
అదే ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అయితే, ఇప్పటికీ ఆ ఒరిజినల్ కథ హరీష్ దగ్గర వుంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఇంకా ప్రాధమిక దశలోనే వుంది. సో, మార్పు చేసుకోవడం ఏమంత కష్టమైన పని కాదు.
కానీ, పవన్ కళ్యాణ్‌తోనే అసలు సమస్య. ఆయన రాజకీయ కారణాలతో ఒరిజినల్ సినిమాలకు కమిట్ అవ్వడమనేది ఒకింత పెద్ద సమస్యే.
ఇదిలా వుంటే, మరో ఇద్దరు యంగ్ డైరెక్టర్లు పవన్‌తో సినిమా చేయాలని ముందుకొచ్చారట. రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు సైతం ఈ ప్రాజెక్టులు టేకప్ చేసేందుకు సిద్ధంగా వున్నాయట.
పవన్ ఓకే చెప్తే వెంటనే పట్టాలెక్కించేందుకు సర్వం సిద్ధం చేసి వుంచారట. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం సినిమాల పరంగా పవన్ కళ్యాణ్‌ని అయోమయంలో పడేసింది.