సమంత, నాగ చైతన్య కాంప్రమైజ్ అవుతారా.?

నాగ చైతన్య, సమంత ఒక్కటి కావల్సిందేనా.? అక్కినేని ఫ్యామిలీకీ, ఇటు సమంతకీ అదే మంచిదా.? కెరీర్ పరంగా ఈ ఇరు వర్గాల మధ్య ఒకింత సందిగ్ధం ఏర్పడింది.మరోవైపు నాగార్జున కూడా ఈ పరిణామాల పట్ల ఆందోళనగా వున్నాడట. ఈ పరిస్థితిని ఎలాగైనా చక్కదిద్దాలన్న సంకల్పంతో వున్నాడట.

అలా జరగాలంటే ఒక్కటే మార్గం. నాగ చైతన్య, సమంత ఒక్కటి కావడమే. ఏంటి పర్సనల్ లైఫ్‌లోనే.! అంటారా.? ఏమో పర్సనల్ లైఫ్ వరకూ వెళతారో.? లేదంటే, జస్ట్ ప్రొఫిషనల్‌గా అయినా కలిసుంటారో తెలీదు కానీ, ఈ ఇద్దరితోనూ ప్రాజెక్ట్ సెట్ చేయడానికైతే అటు సమంత సన్నిహితులూ, ఇటు నాగార్జున సన్నిహితులు ప్రయత్నిస్తున్నారట.

తెర వెనక మంతనాలు గట్టిగా జరుగుతున్నాయని తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే, చైతూకీ, సమంతకీ టోటల్‌గా అక్కినేని ఫ్యామిలీకి మహర్దశ పట్టినట్లే.!