Gopichand : ఇప్పటికైనా గోపీచంద్ మారుతాడా..! పక్కా కమర్షియల్ నూ కమర్షియల్ హిట్ చేసుకుంటాడా..?

Gopichand: తొలివలపు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు గోపీచంద్. కొన్ని సినిమాలలో విలన్ గా కూడా నటించింది ప్రజల మన్ననలు పొందాడు. విలన్ గా చేసి తర్వాత హీరోగా సెటిల్ అయిన కొద్దిమంది హీరో నెల గోపీచంద్ ఒకరు. కానీ గోపీచంద్ కు ఈ మధ్య సరైన విజయం లేదు. వరస సినిమాలు చేసుకుంటూ పోవడమే దీనికి కారణం అని అంటున్నారు. ఇటీవల వచ్చిన సిటీ మార్ చిత్రం కూడా తగిన విజయాన్ని అందించలేకపోయింది.

కథల విషయంలో గోపీచంద్ జాగ్రత్తలు తీసుకోక పోవడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేయబోతున్నా పక్కా కమర్షియల్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం గోపీచంద్ కంటే వెనక వచ్చిన హీరోలు కూడా మంచిది విజయాల తో దూసుకుపోతున్న టంతో, గోపీచంద్ కు ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా హిట్ అవ్వడం చాలా అవసరం. అందుకే ప్రస్తుతం గోపీచంద్ తో పాటు అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. కాగా ఈ సినిమా జూలై 1న విడుదల అవుతుందనే అధికారిక ప్రకటన రావటంతో ఇది సరైన సమయం కాదా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

జూలై నెలలో ఎక్కువ సినిమాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో తప్పకుండా ఈ సినిమా కు మంచి తేదీ పెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. తొందరలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్ లు వచ్చే అవకాశం ఉన్నాయి. మంచి సినిమాలు తీసే మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా గోపీచంద్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. అయితే గోపీచంద్ ఈ సినిమా తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు పార్టీ ప్రభాస్ తో ఒక సినిమా చేయబోతున్నాడు.