‘దేవర’.! ఆ లోటు తప్పదా.?

ఎన్టీయార్ 30వ సినిమాగా రూపొందుతోన్న ‘దేవర’ సినిమా గురించి ఓ టాక్ ప్రచారంలో వుంది. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కాస్త తక్కువగా వుంటాయని అంటున్నారు.

డైరెక్టర్ కొరటాల శివ ముందే ఈ విషయం చెప్పేశారు. ఈ సినిమా కంప్లీట్‌గా సీరియస్ నోట్‌లో నడుస్తుందని. అలాగే, ఎంటర్‌టైన్‌మెంట్‌కి చోటు చాలా చాలా తక్కువ అని కొరటాల చెప్పేశారు.

అంతేకాదు, ఈ సినిమాలో పాటలకు కూడా స్కోప్ తక్కువట. మూడు నాలుగు పాటలు మాత్రమే వుండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్టీయార్ అంటే మాస్ హీరో. ఓ మాస్ హీరో సినిమాకి వుండాల్సిందే అది ఎంటర్‌టైన్‌మెంట్, గ్లామర్. అది తక్కువ చేస్తే ఆడియన్స్ డిజప్పాయింట్‌మెంట్ తప్పదు.

అలాగే, ఈ సినిమాతో గ్లామర్ క్వీన్ అయిన జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీయార్, జాన్వీ కాంబినేషన్‌లో మంచి డాన్సులూ, గ్లామర్ ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అభిమానులు. అవి తక్కువ చేస్తే ఎలా.? చూడాలి మరి ఏం జరుగుద్దో.!