అల్లు అర్జున్ కర్చీఫ్ వేశాడట.! ఒప్పేసుకుంటావా ‘రెడ్డీ’.!

ప్రభాస్‌తో ‘స్పిరిట్’ సినిమా చేయాల్సి వుంది. ఆ తర్వాత మహేష్‌బాబుతో ‘డెవిల్’ సినిమా చేస్తాడట. అబ్బో, ఇవేవీ ఇప్పట్లో తేలేవి కావు. మధ్యలో ఇంకో బాలీవుడ్ సినిమా కూడా చేసే అవకాశం లేకపోలేదు. ‘యానిమల్’ డైరెక్టర్, మన ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ రెడ్డి వంగా గురించే ఇదంతా.

ఇంతకీ, ఇక్కడ అల్లు అర్జున్ ప్రస్తావన ఎందుకు.? అంటే, గతంలో సందీప్ రెడ్డి వంగాతో అల్లు అర్జున్ భేటీ అయ్యాడు. ఆ కలయిక వెనుక పెద్ద కథే వుంది. నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమాకి స్కెచ్ వేశాడు. అదీ అసలు సంగతి.

అయితే, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ పనుల్లో బిజీగా వున్నాడు. ‘పార్ట్-2’ ‘అంతకు మించి’ వుండబోతోంది. ఆ తర్వాత, త్రివిక్రమ్ సహా పలువురు దర్శకులతో సినిమాలున్నాయ్ అల్లు అర్జున్‌కి.

ఒకరిద్దరు తమిళ డైరెక్టర్లనీ అల్లు అర్జున్ లైన్‌లో పెట్టాడు. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగాని కూడా లిస్టులోకి తీసుకొస్తున్నాడట. ఏదైనా, ‘యానిమల్’ ఫలితం తేలాకే, ముందడుగు.. అని తెలుస్తోంది.

ఈ మధ్యన కొన్ని సినిమాల విడుదలకు ముందు, ఈ తరహా హంగామా నడవడం, ఆ సినిమాలకు కొంత హైప్ అదనంగా యాడ్ అవడం తెలిసిన సంగతే. ఇది కూడా అంతేనా.! లేదంటే, నిజంగానే సందీప్ – అల్లు అర్జున్ మధ్య ఏదో నడుస్తోందా.?