ఐశ్వర్యారాయ్ వస్తుందా.? రాదా.?

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరాయ్ తెలుగులో ఓ సినిమా చేయబోతోందిట.! తమిళంలో సినిమాలు చేస్తుంటుందిగానీ, తెలుగు సినిమా అనగానే.. ఒకింత దూరం జరిగిపోతుంటుందామె.!

కానీ, ఈసారి ఆమె తెలుగులో నటించడం ఖాయమేనట. ఓ సీనియర్ హీరో కొత్త ప్రాజెక్టు కోసం ఐశ్వర్యారాయ్‌తో ‘హై లెవల్‌లో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరో ఎవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఐశ్వర్యారాయ్ మాత్రం, గట్టిగానే డిమాండ్ చేస్తోందని అంటున్నారు. ఓ యంగ్ హీరో దర్శకత్వం వహించబోయే సినిమా అట అది. పాన్ ఇండియా స్థాయిలో సినిమాని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే, వచ్చే నెలలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన వుండొచ్చునట.