ఆ దర్శకులిద్దరికీ బుట్ట బొమ్మ అంటే అంత క్రేజ్ ఎందుకు.. అస్సలు వదలలేకపోతున్నారు..?

ప్రస్తుతం ఎన్.టి.ఆర్.. ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నాడు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ కొమరం భీం గా కనిపించనున్నాడు. కాగా ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ మీదకి వెళ్ళబోతుంది. సమ్మర్ టార్గెట్ గా ఆర్ ఆర్ ఆర్ ని కంప్లీట్ చేయాలని రాజమౌళి బృందం ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు త్వరలో ఎన్.టి.ఆర్ నటిస్తున్న కొమరం భీమ పాత్ర కి సంబంధించిన వీడియో టీజర్ ని రిలీజ్ చేస్తారని సమాచారం.

NTR 30 Movie | Cast, Release Date, Trailer, Posters, Reviews, News, Photos  & Videos | Moviekoop

ఇక ఈ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుంది. ఈ కాంబినేషన్ లో ఇంతక ముందు వచ్చిన ‘అరవింద సమేత పెద్ద కమర్షియల్ సక్సస్ ని సాధించిన సంగతి తెలిసిందే. ఎన్.టి.ఆర్ ని త్రివిక్రం యాక్షన్ హీరోగా చూపించిన విధానానికి నందమూరి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దాంతో మళ్ళీ ఈ కాంబినేషన్ లో సినిమా కావాలని భావించారు. దాంతో ఎన్.టి.ఆర్ 30 ని త్రివిక్రం రూపొందిస్తున్నాడు. పాన్ ఇండియన్ రేంజ్ లో ఈ సినిమాని తెరకెక్కించేందుకు త్రివిక్రం రెడీ అవుతున్నాడు.

News18 Telugu - PSPK 28: పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా క్రేజీ అప్‌డేట్..  తొలిసారి ఆ పాత్రలో పవర్ స్టార్.. | Happy Birthday PSPK 28 Pawan kalyan Play  crucial politician charecter in ...

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో PSPK 28 తెరకెక్కబోతుంది. ప్రస్తుతం వకీల్ సాబ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్న పవర్ స్టార్ నెక్స్ట్ సినిమాని హరీష్ శంకర్ తో చేయబోతున్నాడు. ఇంతక ముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ క్రియోట్ చేసింది. దాంతో ఇప్పటి నుంచే ఈ కాంబినేషన్ మీద అటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇటు కామన్ ఆడియన్స్ కి అంచనాలు భారీగా ఉన్నాయి.

అయితే ఈ ఇద్దరి డైరెక్టర్ కి పూజా హెగ్డే లక్కీ హీరోయిన్ అని ఫిక్సైయారు. ఇప్పటికే హరీష్ శంకర్ దర్శకత్వంలో పూజా.. దువ్వాడ జగన్నాధం, గద్దలకొండ గణేష్ సినిమాలు చేసింది. అలాగే త్రివిక్రం దర్శకత్వంలో అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలు చేసింది. ఈ సినిమాలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఈ దర్శకులిద్దరు తమ నెక్స్ట్ సినిమాలకి పూజా నే హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం.