NTR and Prashanth Neel : ఎన్టీఆర్ లా రామ్ చరణ్, అల్లు అర్జున్ ఆలోచించలేదు ఎందుకో…!

NTR and Prashanth Neel : ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ఎన్టీఆర్ లు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ లు టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్లయ్యారు ఈ ఏడాది. ఇక ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్లు గా ప్రభాస్ యష్ లు ఉండనే ఉన్నారు. ఇక రాజమౌళి లాంటి పవర్ ఫుల్ డైరెక్టర్ కేజీఎఫ్ తో ఇండియా కు దొరికాడు ప్రశాంత్ నీల్.  ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాతో బాలీవుడ్ టాలీవుడ్ లలో ప్రభంజనం సృష్టిస్తున్నాడు. హీరో ఎలివేషన్ అంటే ఇలా ఉండాలి అనేలా ప్రశాంత్ టేకింగ్ కేజీఎఫ్ చాప్టర్ 2 లో ఉంది. సినిమాలోని ప్రతి సీన్ ట్రైలర్ లా ఉత్కంఠను పంచాయి ప్రేక్షకులకు.

ఇక ప్రశాంత్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇక ఆ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు ప్రశాంత్ స్పష్టం చేసాడు. ఇక ఆ తరువాతే మరో హీరోకు ప్రశాంత్ తో సినిమా చేసే అవకాశం ఉంటుంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కు వీరాభిమాని కావడం వల్ల ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రశాంత్ నీల్ కూడా ఆసక్తి చూపిస్తున్నారు. చరణ్, బన్నీ ప్రయత్నిస్తే కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా రిలీజ్ కాకముందే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ అయ్యి ఉండేది.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ పై ఉన్న కాన్ఫిడెన్స్ వల్ల ఎన్టీఆర్ ముందే ప్రశాంత్ నీల్ తో సినిమా ఫిక్స్ చేసుకోగా ఈ విషయంలో చరణ్, బన్నీ మాత్రం పొరపాటు చేసారని ఫిల్మ్ నగర్ లో టాక్ నడుస్తోంది. చెర్రీ, బన్నీ అనుకుని ఉంటే కేజీఎఫ్ చాప్టర్ 2 కన్నా ముందే ప్రశాంత్ సినిమా ఓకే చేయించుకుని ఉండొచ్చు. కానీ ప్రశాంత్ పై ఇంకా నమ్మకం రాకపోవడం వల్ల ఆ పని చేయలేదు. కానీ తారక్ మాత్రం ప్రశాంత్ వర్క్ పై నమ్మకంతో ముందే ప్రాజెక్ట్ ఓకే చేసేసాడు. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి తారక్ పుట్టినరోజున ఏదైనా అప్ డేట్ వచ్చే ఛాన్స్ ఉంది.