ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ సినిమాలన్ని పాన్ ఇండియన్ కేటగిరీలో రూపొందుతున్నాయంటే ఆ క్రెడిట్ మొత్తం ఖచ్చితంగా దర్శక ధీరుడిగా పేరు సాధించిన రాజమౌళి కి చెందుతుంది. బాహుబలి సినిమాకి ముందు మన తెలుగు సినిమా ఏ స్టార్ హీరోతో నిర్మించినా 50-70 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే ఎంతో గొప్పగా చెప్పుకునేవారు. కాని బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ లో అనేకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మన తెలుగు సినిమా సత్తా హాలీవుడ్ వరకు వెళ్ళింది.
అక్కడ పెద్ద పెద్ద మేకర్స్ కూడా తెలుగు నుంచి రాజమౌళి లేదా ప్రభాస్ సినిమా గురించి ఎదురు చూసే స్థాయికి చేరుకోవడం గొప్ప విషయం. ఒక కథ అనుకున్నాక ఆ కథ ని వెండితెరమీద ఆవిష్కరించే వరకు రాజమౌళి ఎంతగా శ్రమిస్తాడో తన బృందాన్ని అంతగా కష్టపెడతాడు. ఒక్క షాట్ కోసమే రాజమౌళి ఎన్నో విధాలుగా ఆలోచించి తీయడం కాంప్రమైజ్ కాకపోవడం రాజమౌళి ప్రత్యేకత.
ప్రస్తుతం ఎన్.టి.ఆర్, రాం చరణ్ లతో ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్న రాజమౌళి భారీ తారాగణాన్ని ఈ సినిమా కోసం ఎన్నుకున్నాడు. బాలీవుడ్ నుంచి ఆలియా భట్, అజయ్ దేవగన్, బ్రిటన్ మోడల్ ఓలియా మోరిస్ తో పాటు కొంతమంది హాలీవుడ్ నటులు కూడా ఆర్ ఆర్ ఆర్ లో కీలక పాత్ర పోషిస్తున్నారట. అయితే ఈ సినిమా లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న రాం చరణ్ సరసన ఆలియా భట్ సీత పాత్ర కోసం ఎన్నుకున్నారు.
అయితే ఇటీవల బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మృతి తర్వాత నెపోటిజం కి సంబంధించి ఆలియా భట్ .. తన తండ్రి మహేష్ బట్ విపరీతంగా ట్రోల్స్ కి గురయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆలియా నటించిన సడక్ 2 ట్రైలర్ తో పాటు సినిమాని కూడా నెటిజన్స్ తీవ్రంగా ట్రోల్ చేశార్. దీంతో ఇక ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా నటించదన్న టాక్ మొదలైంది. అంతేకాదు ఆలియా ఆర్ ఆర్ ఆర్ నుంచి తప్పుకుంది అని చెప్పుకున్నారు. కాని రాజమౌళి మాత్రం ఆలియా విషయంలో వెనకడుగు వేయలేదు.
అంతేకాదు ఆలియా ఫెంటాస్టిక్ యాక్టర్ అని కితాబిచ్చాడు. తన పర్సనల్ విషయాలతో తనకి సంబంధం లేదని ఆర్ ఆర్ ఆర్ లో అనుకున్న క్యారెక్టర్ కి ఆలియా తప్ప మరెవరూ న్యాయం చేయలేరని తేల్చి చెప్పారు. దీంతో అందరూ అనుకున్న కామెంట్స్ కి పంచ్ పడ్డట్టు అయింది. ఇదే కాదు ఆలియా వాయిస్ ఆర్ ఆర్ ఆర్ లో వినిపించబోతుందట. తన పాత్రకి తనే డబ్బింగ్ చెప్పుకోబోతుందని ఇది రాజమౌళి సూచించారని తెలుస్తుంది. మొత్తానికి అందరూ ఆలియాని ట్రోల్ చేసినప్పటికి రాజమౌళి మాత్రం తనలోని నటికి గౌరవివ్వడం గొప్ప విషయం.