బంగార్రాజు.. అసలు నీ ప్రాబ్లమేంటయ్యా?

nagarjuna bangarraju

సినీ కెరీర్ మొత్తంలో అక్కినేని నాగార్జునకు బిగ్గెస్ట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ అందించిన చిత్రం సోగ్గాడే చిన్ని నాయనా. 2016లో పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఆ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాకు తెలుగు ఆడియెన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సినిమా సక్సెస్ కావడంతో నాగార్జున దానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు అప్పట్లోనే అనేక రకాల కథనాలు వచ్చాయి.

nagarjuna

అయితే డిఫరెంట్ గా ఉండాలని బంగార్రాజు పాత్రతోనే మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే సినిమాలో ఆ పాత్రనే హైలెట్ గా నిలిచింది. ఇక గత రెండేళ్ల నుంచి ఆ సినిమాకు సంబంధించిన కథ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ స్క్రిప్ట్ లో ఎన్నో మార్పులు చేయాల్సి వచ్చింది. ఇక ఫైనల్ గా ఇటీవల దర్శకుడు, అనుబ్ రూబెన్స్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ వేసినట్లుగా తెలుస్తోంది.

మ్యూజిక్ విషయానికి వచ్చారు అంటే ఆల్ మోస్ట్ ప్రాజెక్టు ఓకె అయినట్లే.. కానీ నాగ్ ఇంకా ఒక్కసారి కూడా ఆ ప్రాజెక్ట్ పై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇంకా అధికారికంగా తెలుపకపోవడానికి అసలు ఈ బంగార్రాజుకు వచ్చిన ప్రాబ్లమ్ ఏమిటనేది ఓ వర్గం అభిమానుల్లో మెదులుతున్న సందేహం. రూమర్స్ ప్రకారం అయితే నాగ్ వచ్చే ఏడాది బంగార్రాజుకు సెట్స్ పైకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాను రిలీజ్ కు సిద్ధం చేస్తున్న నాగ్ ఆ తరువాత ప్రవీణ్ సత్తారు సినిమాతో కూడా బిజీ కానున్నాడు.