మంచు లక్ష్మి సైలెన్స్.. కుటుంబ గొడవల మధ్య ఊహించని నిర్ణయం

మంచు కుటుంబంలో విభేదాలు తీవ్రమవుతున్న సమయంలో, మంచు లక్ష్మి తమ కుటుంబ సమస్యలపై నిశ్శబ్దంగా ఉండడమే కాదు, దూరంగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది. మోహన్ బాబు, మనోజ్ మధ్య ఏర్పడిన వివాదం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ గొడవల మధ్య లక్ష్మి పేరు పెద్దగా వినిపించడం లేదు. అలాగే జరిగిన గొడవలకు ఆమె దూరంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

మంచు లక్ష్మి, కొన్ని నెలల క్రితం నుంచి ముంబైలోనే ఉంటున్నారు, తన వ్యక్తిగత జీవితం, సినీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు. సోషల్ మీడియాలో ఆమె హోమ్ టూర్ వీడియోలు, హై ప్రొఫైల్ పార్టీల్లో పాల్గొన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా, తన కుటుంబంలో సమస్యలు పెరుగుతున్న క్రమంలో లక్ష్మి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తోంది. అయితే తండ్రి, సోదరులతో జరిగిన సమావేశంలో పరిస్థితి చక్కదిద్దేందుకు ఆమె చేసిన ప్రయత్నాలు ఫలితం ఇవ్వలేదని సమాచారం.

విషయం మరింత సీరియస్ అవుతుండటంతో, లక్ష్మి తిరిగి ముంబైకి వెళ్లిపోయారని తెలుస్తోంది. తన కుటుంబం ఈ వివాదంలో మరింత చిక్కుకోవడం ఆమెకు బాధ కలిగించినప్పటికీ, ఎవరి పక్షానా మాట్లాడకుండా, పూర్తిగా సైలెంట్ గా ఉండటమే మంచిదని భావించారట. సోదరుడు మనోజ్‌తో ఆమెకు మంచి బాండింగ్ ఉంది. ఆ ఆప్యాయత కారణంగా, లక్ష్మి అతని రెండవ పెళ్లి టైమ్ లో అతనికి అండగా నిలిచారు. ఇక ఇప్పుడు మాత్రం ఆమె పరిస్థితి తన చేతుల్లో లేకపోవడంతో వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది