టాలీవుడ్‌లో సీనియర్ హీరో సరసన రాశి ఖన్నా.?

సినిమాల సంగతెలా వున్నా వెబ్ సిరీస్‌లలో బాగానే అవకాశాలొస్తున్నాయ్ అందాల భామ రాశి ఖన్నాకి. ఆమె నటించిన ‘ఫర్జి’ వెబ్ సిరీస్.. ఆమెకు బోల్డంత పేరు తెచ్చిపెట్టింది. అందలా అందులో రాశి ఖన్నా ఏం చేసిందబ్బా.? అనడగొద్దు.. అదంతే.

ఇక, రాశి ఖన్నా తెలుగులో ఓ సీనియర్ హీరో సరసన కనిపించబోతోందన్నది తాజా ఖబర్. ఆ సినిమా కోసం రాశి ఖన్నా ఇప్పటిదాకా ఎప్పుడూ అందుకోనంత రెమ్యునరేషన్ అందుకోబోతోందిట.

ఎవరా సీనియర్ హీరో.? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. యంగ్ హీరోల సరసన సినిమాలు చేయాల్సిన రాశి ఖన్నా, సీనియర్ హీరోలకు ఎందుకు ఓకే చెబుతోందబ్బా.? అని కొందరు గుస్సా అవుతున్నారు.

టాలీవుడ్‌ని హీరోయిన్ల కొరత వెంటాడుతోంది. అందునా, సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడంలేదు. సో, ఈ అవకాశాన్నిరాశి ఖన్నా బాగానే క్యాష్ చేసుకునే అవకాశం వుంది. అయితే, వచ్చిన అవకాశం ఆమెకు హిట్ ఇస్తేనే.. లేదంటే, అంతే సంగతులు.