హరీష్ శంకర్ ఎందుకు డుమ్మా కొట్టాడబ్బా.?

మామూలుగా అయితే, పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఈవెంట్‌కి దర్శకుడు హరీష్ శంకర్ డుమ్మా కొట్టడు. కొట్టాడంటే, దానర్థమేంటి.? పైగా, సాయి ధరమ్ తేజ్ కూడా అత్యంత సన్నిహితుడు హరీష్ శంకర్‌కి.! ఎక్కడో తేడా కొట్టింది.

భగవంతుడి సినిమా ఫంక్షన్.. భక్తుడి ఆబ్సెన్స్.. అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల సెటైర్లు పడ్డాయ్.!  ‘బ్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హరీష్ శంకర్ లేకపోవడంపై బోల్డన్ని ప్రశ్నలు. హరీష్ శంకర్ అయితే ఇప్పటిదాకా స్పందించలేదు. అసలు కారణమేంటంటే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి మాట్లాడాల్సి వస్తుందనీ, అలా మాట్లాడేందుకు ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదనీ.. ఇంతేనట.!

నిజమే, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ దాదాపు అటకెక్కినట్లే.! ‘బ్రో’ వచ్చేస్తోంది. ‘ఓజీ’ రావాల్సి వుంది. ‘ఓజీ’ ఒక్కటే పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికలకు ముందు పూర్తిచేయగల సినిమా. మరి, హరీష్ శంకర్ పరిస్థితేంటి.? ఆయనా వేరే దారి చూసుకుంటున్నాడు.. చూసుకోవాలి.. తప్పదు.!