హరీష్ శంకర్‌కి పవన్ కళ్యాణే అది చెప్పాడా.?

అరరె.. హరీష్ శంకర్ తన ‘దేవుడు’ పవన్ కళ్యాణ్‌ని వదిలేసి తన దారి తాను చూసేసుకున్నాడే.! ఎప్పుడు ఓకే అయిన కాంబినేషన్.? ఎప్పుడు పూర్తవుతుంది.? అదే, పవన్ కళ్యాణ్ – మైత్రీ మూవీ మేకర్స్ – హరీష్ శంకర్ సినిమా.!

తొలుత ‘భవదీయుడు భగత్ సింగ్’ అన్నారు. కానీ, అది ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అయి కూర్చుంది. సినిమా అనౌన్స్ అయి, సెట్స్ మీదకు వెళ్ళడానికే చాలా కాలం పట్టేసింది. తీరా సినిమా ప్రారంభమయినా, మళ్ళీ స్పీడ్ బ్రేకర్లు.

పవన్ కళ్యాణ్‌కి నష్టమేం లేదు. ఎందుకంటే, అటు రాజకీయాలు.. ఇటు ఎడా పెడా సినిమాలూ.! హరీష్ శంకర్‌కి అలా కాదు కదా.! దేవుడు పవన్ కళ్యాణ్‌ని నమ్ముకున్న భక్తుడు గనుక, ఇంకో దారి వెతుక్కోలేకపోయాడు.

చివరికి తప్పలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వదిలేసి, రవితేజతో సినిమాకి కమిట్ అయిపోయాడు. అలా వదిలెయ్యడం వెనుక బలమైన కారణమే వుందిట. అనివార్య కారణాలతో, అనుకున్న షెడ్యూల్ జరగకపోవడంతో, పవన్ కళ్యాణ్ స్వయంగా హరీష్ శంకర్‌ని పిలిచి, ‘ఈ ప్రాజెక్టు ఇక్కడి నుంచి ముందుకెళ్ళాలంటే సమయం పడుతుంది. ఈలోగా నీ పని నువ్వు చేసుకో..’ అంటూ రవితేజ వైపు పంపించాడట.

రవితేజ కూడా పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుడే గనుక, అర్థం చేసుకుంటాడు హరీష్ శంకర్‌ని.