‘బింబిసార’ సీక్వెల్‌పై డౌటానుమానాలెందుకు.?

మీకు గుర్తుందా.? ‘బింబిసార’ సినిమా సమయంలో.. ఇదొక ‘సిరీస్’ అని చెప్పుకున్నారు. రెండో పార్ట్ త్వరలో సెట్స్ మీదకు వెళుతుందన్నారు. మూడో పార్ట్‌లో యంగ్ టైగర్ ఎన్టీయార్ నటించే అవకాశం వుందనీ ప్రచారం జరిగింది.

తుస్సుమందిప్పుడు.! అసలు రెండో పార్ట్‌కి ఆస్కారమే లేదట. మూడో పార్ట్ గురించి మాట్లాడుకోవడమే దండగట. యంగ్ టైగర్ ఎన్టీయార్ అసలు ‘బింబిసార’ వైపు చూసే అవకాశమే లేదన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

కేవలం ‘బింబిసార’ సినిమాని లేపడం కోసం అప్పట్లో ‘బింబిసార యూనివర్స్’ పేరుతో ప్రచారం చేశారన్నది తాజా ఖబర్. కానీ, ఆ సిరీస్‌లో సినిమాలొస్తే ఇంట్రెస్టింగ్‌గానే వుంటుంది.

అయితే, పరిస్థితులూ అనుకూలించాలి కదా.? అదే అసలు సమస్య. ఏమో, ‘అమిగోస్’ రిలీజ్ తర్వాత కళ్యాణ్ రామ్ ఆలోచనలు ఎలాగైనా మారొచ్చు. ప్రస్తుతానికైతే ‘బింబిసార’ రెండో పార్ట్ అనేది ఆలోచనల్లో కూడా లేదన్నది విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారమ్.