మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా వెళ్ళాడు. అక్కడ ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాడు. దీనికంటే ముందు, పలు టీవీ షోల్లో కనిపించేలా మొత్తం టూర్‌ని ‘డిజైన్’ చేశారు. ఆ ప్రకారంగానే కార్యక్రమాలు నడుస్తున్నాయి.
నిజానికి, యంగ్ టైగర్ ఎన్టీయార్ కూడా అమెరికా వెళ్ళాల్సి వుందట. అయితే, కుటుంబంలో జరిగిన విషాద ఘటన (తారకరత్న మరణం) సహా అనేక కారణాలతో, యంగ్ టైగర్ ఎన్టీయార్ తాను అమెరికా పర్యటనకు దూరంగా వుండాలని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నాడట.
మరోపక్క, ‘ఎన్టీయార్-30’ సినిమా వ్యవహారాల నిమిత్తం కూడా యంగ్ టైగర్ ఎన్టీయార్ బిజీగా వున్నాడనీ, అందుకే అమెరికా వెళ్ళలేదనీ అంటున్నారు. కారణం ఏదైనా, ‘చరణ్ వెళ్ళాడు.. ఎన్టీయార్ వెళ్ళలేదు’ అన్న కోణంలో సోషల్ మీడియాలో పెద్దయెత్తున ఇరువురు హీరోల అభిమానుల మధ్యా రచ్చ జరుగుతోంది.
‘గ్లోబల్ స్టార్ ఎవరు.?’ అంటూ అభిమానులు కొట్టుకుంటున్నారు. అయితే, తాను తండ్రి కాబోతున్న విషయాన్ని తొలుత తారక్‌తోనే పంచుకున్నానని అమెరికాలో ఓ టీవీ షోలో మాట్లాడుతూ చరణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.