ఖుషి టైటిల్ ఎందుకు పెట్టారంటే.. కారణమిదే..

విజయ్ దేవరకొండ సమంత జంటగా నటిస్తున్న ‘ఖుషి’ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. అసలు ఈ సినిమాకు ‘ఖుషి’ అనే టైటిల్ ఎందుకు పెట్టారు అనే అనుమానాలు మొదటి నుంచి కూడా వస్తూనే ఉన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ మంచి లవ్ స్టోరీలను తెరపైకి తీసుకు రావడంలో సిద్ధహస్తుడు. అయితే ఆయన ఎందుకు ఖుషి టైటిల్ పెట్టారు అని విషయంలో అనేక రకాల గాసిప్స్ అయితే వచ్చాయి.

నిజానికి ఈ సినిమా కథకు టైటిల్ కు చాలా దగ్గర సంబంధం ఉంది అంతేకాకుండా 2001లో వచ్చిన పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా కథకు కూడా ఇది చాలా దగ్గరగానే ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ భూమిక నటించిన ఖుషి సినిమాలో మెయిన్ కథ హీరో హీరోయిన్ మధ్యలో ఈగో చుట్టూ తిరుగుతుంది. చిన్నపాటి అహంకారాల వలన ఒక అమ్మాయి అబ్బాయిల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగుతాయి అనే ఆ కథ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అయితే ఇప్పుడు రాబోతున్న ‘ఖుషి’ సినిమాలో కూడా దర్శకుడు శివ అదే తరహాలో విజయ్ దేవరకొండ, సమంత మధ్యలో కొన్ని ఈగో పాయింట్స్ ను హైలెట్ చేయబోతున్నాడట. అయితే అవి మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటాయి అని తెలుస్తోంది. నేటి తరానికి కనెక్ట్ అయ్యే విధంగా నేటి వాతావరణానికి తగ్గట్టుగా ఈగో క్లాశేస్ ను ప్రజెంట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఎలాగు పాత ఖుషి సొల్ పాయింట్ తీసుకున్నారు కాబట్టి అదే టైటిల్ పెడితేనే సినిమాకు కావాల్సినంత హైప్ వస్తుంది అని దర్శకుడు ఆలోచించినట్లుగా తెలుస్తోంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.