Kiara Advani: కియారా గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్‌కు దూరం.. అసలేం జరిగింది?

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. కియారా అద్వానీ ప్రధాన కథానాయికగా నటించిన ఈ సినిమా హిందీ ప్రేక్షకులను కూడా ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. గతంలో ‘వినయ విధేయ రామ’లో చరణ్‌తో కలిసి నటించిన కియారా, ఈ సినిమాలో మరోసారి జోడీ కట్టింది. కానీ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆమె కనిపించకపోవడం ప్రేక్షకుల్లో అనుమానాలు రేకెత్తిస్తోంది.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కియారా, హిందీ బిగ్ బాస్‌లో చరణ్‌తో కనిపించారు. కానీ, డల్లాస్, రాజమండ్రి వంటి కీలక ఈవెంట్లకు ఆమె గైర్హాజరు కావడం వల్ల పలు పుకార్లు పుట్టుకొచ్చాయి. కియారాకు సౌత్ ప్రమోషన్‌పై ఆసక్తి లేదని, కావాలనే దూరంగా ఉంటున్నారనే వార్తలు తెరపైకి వచ్చాయి. ఇదే సమయంలో ఆమె ఆసుపత్రిలో చేరారన్న వార్తలు కూడా చర్చనీయాంశమయ్యాయి.

ఈ పుకార్లపై కియారా టీమ్ స్పందించి స్పష్టతనిచ్చింది. కియారా ఆసుపత్రిలో చేరలేదని, కేవలం బిజీ షెడ్యూల్ వల్ల విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. బాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న కియారా, ఇటీవల ‘వార్ 2’ షూటింగ్ పూర్తి చేశారు. దీంతో పాటు గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ నిర్వర్తించడం ఆమెకు సవాలుగా మారిందని, అందుకే విశ్రాంతి తీసుకుంటున్నట్లు టీమ్ వెల్లడించింది.

జనవరి 10న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం కియారా కెరీర్‌లో కీలకమని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రచార కార్యక్రమాల్లో మిగిలిన భాగస్వామ్యం పై స్పష్టత లేకపోయినా, సినిమా విడుదల తర్వాత కచ్చితంగా కియారా ప్రమోషన్స్‌లో కనిపించవచ్చని టాక్. ఈ నేపథ్యంలో అభిమానులు ఆమెను మళ్లీ తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

జగన్ చేస్తే వ్యభి*చారం కూటమి చేస్తే సంసారమా ? || Analyst Purushottam Reddy || Ys Jagan || TDP || TR