ఎవరీ వినయ్ మహేశ్వరి.. మంచు కుటుంబంలో అతనికెందుకు అంత ప్రాధాన్యత!

మంచు కుటుంబంలోని గొడవలు ముదిరి ఒకరి మీద ఒకరికి కంప్లైంట్లు ఇచ్చుకునేంతవరకు వెళ్లాయి. తన కొడుకు మనోజ్ కోడలు మౌనిక నుంచి ప్రాణహాని ఉందని మోహన్ బాబు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అలాగే మనోజ్ కూడా తన తండ్రి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే గొడవలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు వినయ్ మహేశ్వరి. తండ్రి ఎదురుగా ఉండగా కొడుకు పై ఎదురుదాడి చేసేటంత స్వతంత్రం అతనికి ఎలా వచ్చింది, అసలు ఈ గొడవలకి అతనికి ఏంటి సంబంధం ఒకసారి చూద్దాం.

వినయ్ మహేశ్వరి ప్రస్తుతం మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఈ పదవి చేపట్టడానికి ముందు సాక్షి మీడియా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో పదవులు నిర్వహించారు. అదేవిధంగా హిందీ న్యూస్ పేపర్ ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ బోర్డ్ లోనూ ఆయన మెంబర్గా చేశారు. మంచు కుటుంబానికి చెందిన న్యూయార్క్ అకాడమీ, శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ సంస్థకు సంబంధించిన వ్యవహారాలు కూడా వినయ్ చూస్తారు. ఈయన విష్ణు భార్య వేరోనికా తరపు బంధువు.

అందుకే విష్ణు ఆయనకి ఈ బాధ్యతను అప్పగించారని సమాచారం. వినయ్ మహేశ్వరి వచ్చినప్పటి నుంచే మంచు ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయని మనోజ్ సన్నిహితులు చెప్తున్నారు. ఈటీవలో మంచు ఇంటిలో జరిగిన ఆస్తులు గొడవలు సైతం వినయ్ మహేశ్వరి మీద మనోజ్ చేయి చేసుకున్నారని ఆ తర్వాత జరిగిన తోపులాటలో మంచు మనోజ్ కి గాయాలు అయ్యాయని తెలుస్తుంది.

వినయ్ మహేశ్వరి విష్ణు మద్దతుదారుడు అని తెలిసిందే. విష్ణు వినయ్ ఇద్దరు మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులకు అక్కడ వ్యాపారాలు చేసే స్థానికులకు చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారని, వారిద్దరూ చేస్తున్న ఆర్థిక అవకతవకలకు సంబంధించి తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని అవసరమైతే వాటిని అధికారులు ముందు బయట పడతారని చెప్తున్నారు మంచు మనోజ్.