మహేష్ రాజమౌళి కాంబో.. రానా కామెంట్!

సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా కథాంశం అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, అడ్వంచర్ ట్రావెలర్ గా ఈ మూవీలో మహేష్ బాబు ఉంటాడని ఇప్పటికే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టార్ క్యాస్టింగ్ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాని యూనివర్సల్ లెవల్ లో ప్రమోట్ చేయడం వెనుక సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ మార్కెట్ ప్లాన్ ఉందనే టాక్ ఇప్పుడు వినిపిస్తుంది.

ఆర్ఆర్ఆర్ ని గ్రాండ్ గా ప్రమోట్ చేయడం ద్వారా ఇప్పుడు ఆస్కార్ కి ఎంట్రీ లభించింది. ఆస్కార్ అవార్డు వస్తే మాత్రం రాజమౌళికి యూనివర్సల్ అప్పీల్ కచ్చితంగా వస్తుంది. ఇప్పటికే జేమ్స్ కామెరూన్, స్పిల్ బర్గ్ లాంటి లెజెండరీ దర్శకులు రాజమౌళి మేకింగ్ విజన్ పైన, అలాగే కథ చెప్పే విధానంపై ప్రశంసలు కురిపించారు. జేమ్స్ కామెరూన్ అయితే ఏకంగా షేక్స్ పియర్ తో రాజమౌళి కంటెంట్ నేరేషన్ స్కిల్ ని పోల్చాడు.

దీంతో జక్కన్న ప్రపంచ దృష్టిని ఇప్పుడు ఆకర్షించాడు. ఇదిలా ఉంటే బాహుబలి సిరీస్ లో బళ్ళాలదేవ పాత్రలో రానాకి కూడా పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఛాన్స్ దొరికితే రాజమౌళితో వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఓపెన్ స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీలో విలన్ గా ఛాన్స్ వస్తే ఒక్క మాట మాట్లాడకుండా ఒప్పుకుంటా అని రానా చెప్పుకొచ్చారు.

రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా రానా ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే ఈ సినిమాని పాన్ వరల్డ్ లెవల్ లో తీస్తున్నారు కాబట్టి కచ్చితంగా విలన్స్ ని ఎక్కువ మందిని తీసుకునే యోచనలోనే జక్కన్న ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యంలో రానా కూడా మూవీలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపధ్యంలో అతన్ని ఎంపిక చేస్తాడా అనేది చూడాలి.