మాటల మాంత్రికుడి పాన్ ఇండియా హీరో ఎవరో?

ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర దర్శకులు అందరూ కూడా పాన్ ఇండియా బ్రాండ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ నుంచి వచ్చే సినిమాలకి దేశ వ్యాప్తంగా మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా భారీ బడ్జెట్ తో సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే రాజమౌళిని అనుసరిస్తూ సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. ఇప్పుడు ఈ జాబితాలోకి కొరటాల శివ వస్తున్నారు.

అలాగే చందూ మొండేటి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు.ఇప్పుడు ఈ జాబితాలోకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా చేస్తున్నారు. మాస్ కమర్షియల్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీని తర్వాత పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు.

అయితే త్రివిక్రమ్ జాబితాలో ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారు. పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ తో మూవీ చేయాలని అనుకుంటున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా లైన్ అప్ లో ఉన్నారు. అయితే తారక్ ప్రస్తుతం చేస్తోన్న దేవర కంప్లీట్ అయిన వెంటనే హిందీలో వార్ 2 మూవీ చేయనున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

ఇవన్ని పూర్తి చేసుకొని త్రివిక్రమ్ కి డేట్స్ ఇవ్వాలంటే మరో రెండేళ్ళు వెయిట్ చేయాల్సిందే. ఈ లోపు బన్నీతో సినిమాని పూర్తి చేయడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అలాగే పుష్ప 2 మూవీతో దేశ వ్యాప్తంగా వచ్చిన ఇమేజ్ ని కంటిన్యూ చేయడానికి ఆ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే చేయాలని అల్లు అర్జున్ ఆలోచిస్తున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పౌరాణిక కథతో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పాన్ ఇండియా మూవీ చేయాలని అనుకుంటున్నారు. అయితే దానిని అల్లు అర్జున్ హీరోగానే చేస్తాడా లేదంటే జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.