Bigg boss 4: ఇంతకీ ఎవరు ఈ జలజ?

who is this jalaja in bigg boss house

బిగ్ బాస్ హౌస్ లో వాతావరణమే మారిపోయింది. అంతా భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా దెయ్యం అరుపులు, గోలలు. బిగ్ బాస్ హౌస్ ఇప్పుడు ఘోస్ట్ హౌస్ లా మారిపోయింది. అయితే.. బిగ్ బాస్ హౌస్ ను అలా మార్చింది జలజ అనే ఓ దెయ్యం. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి కంటెస్టెంట్లను ముప్పుతిప్పలు పెడుతోంది.

who is this jalaja in bigg boss house
who is this jalaja in bigg boss house

ఇంతకీ ఎవరీ జలజ… మమ్మల్ని ఎందుకు టార్చర్ పెడుతోంది.. అంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్లు తలలు గోక్కుంటున్నారు. ఎవరైనా ఇంటి నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్లా? అని గెస్ చేస్తున్నప్పటికీ వాయిస్ కరెక్ట్ గా దొరకడం లేదు.

కొన్నిసార్లు కరాటే కళ్యాణి వాయిస్ లా వినిపిస్తోంది. మరికొన్ని సార్లు సింగర్ గీతా మాధురి వాయిస్ లా వినిపిస్తోంది. ఇంకోసారి ఎవరో ఆర్జే వాయిస్ అంటూ అవినాష్ చెప్పాడు కానీ.. అసలు ఇది ఎవరి వాయిస్.. అనేదానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

అయితే.. ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయిన లేడీ కంటెస్టెంట్లలో కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, దివి, జోర్దార్ సుజాత, గంగవ్వ, లాస్య, స్వాతి దీక్షిత్ ఉన్నారు. కానీ.. వీళ్లలో ఆ వాయిస్ కొంచెం కరాటే కళ్యాణికి సూట్ అవుతుంది.

కానీ.. రెండో వారమే వెళ్లిపోయిన కరాటే కళ్యాణిని దెయ్యం వేషం వేయించి బిగ్ బాస్ ఇదంతా ఎందుకు చేయిస్తాడు? అనే మరోడౌట్ వస్తోంది.

ఏది ఏమైనా.. ఈ జలజ ఎవరో? ఎందుకు బిగ్ బాస్ హౌస్ లో దెయ్యంలా యాక్ట్ చేస్తోందో? కంటెస్టెంట్లను భయపెడుతోందో అనే విషయం ఎప్పుడు తెలుస్తుందో ఏమో?