రేణుదేశాయ్‌ని వెనకుండి నడిపిస్తున్నదెవరు.?

అర్ధం పర్ధం లేని కామెంట్లతో పవన్ కళ్యాణ్‌ని ఇరకాటంలో పెట్టేస్తోంది ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్. ఇటీవల రేణూ దేశాయ్ – పవన్ కళ్యాణ్ దంపతుల వారసుడైన అకీరానందన్ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో జుగుప్స కలిగించే చర్చలు వినిపించాయ్. రేణూ దేశాయ్ విచక్షణ లేని మాటలతో రెచ్చిపోయింది. పవన్ అభిమానులు సైతం ఆమెకు ధీటుగా కామెంట్లు జుప్పిచారు. ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లుగా రేణూ దేశాయ్ వారికి కౌంటర్ ఎటాక్స్ ఇస్తూ వచ్చింది.

అయితే రేణూ దేశాయ్ ఎందుకిలా చేస్తోంది.? ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా.? అంటే అవుననే అంటున్నారు కొందరు. ఈ రకమైన పబ్లిసిటీ స్టంట్స్ ద్వారా సినిమాల్లో అవకాశాల దక్కించుకోవాలని రేణూ దేశాయ్ పాట్లు పడుతోందనీ అంటున్నారు.

అయితే, సినీ పరిశ్రమలోనే కొందరు ఆమెనిలా పవన్ పరువు తీసేందుకు ఎగదోస్తున్నారనీ సమాచారం. రేణూ దేశాయ్ ఇలా చేయడానికి వెనకాల ఓ పెద్ద తలకాయ వందనీ అంటున్నారు. ఆ పెద్ద తలకాయ అండ చూసుకునే రేణూ దేశాయ్ ఇలాంటి రిస్క్ చేస్తోందనీ టాక్. అయితే, ఎవరా పెద్ద తలకాయ్.? ఏంటా కథ.? తెలియాల్సి వుంది.