Balakrishna : బాబాయ్ అబ్బాయ్ ని ఒకే సినిమాకి సెట్ చేసిన ఆ దర్శకుడెవరో తెలుసా..?

 

Balakrishna: ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా భారీ విజయం తర్వాత, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్లో వస్తున్న సినిమానే కాకుండా బాలయ్య బాబు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా కూడా ఓకే చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

బాలకృష్ణ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ తో పాటు కీలక పాత్రలో మరొక హీరో కనిపించబోతున్నాడట. దీనికి సంబంధించి దర్శకుడు ఒక క్లూ కూడా ఇచ్చారు. కీలక పాత్రలో కనిపించే మరొక హీరో కి సంబంధించి, గతంలో ఆ హీరో తో ఒక సినిమా చేశాననికానీ.. ఆ సినిమా అనిల్ చేయలేదు, నా తో ఆ హీరో చేయించాడు. అంటే.. నాకి మొదటి అవకాశం ఇచ్చాడు ఆ హీరో. అని చెప్పకనే చెప్పాడు.

అనిల్ రావిపూడి తో మొదటి సినిమా చేయలేదు కానీ అతనితో మొదటి సినిమా చేయించినది మాత్రం కళ్యాణ్ రామ్. కాబట్టి నందమూరి బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో కీలక పాత్రలో కళ్యాణ్రామ్ కూడా కనిపించబోతున్నారు. బాబాయి సినిమాలో అబ్బాయి కళ్యాణ్ రామ్ కోసం దర్శకుడు అనిల్ రావిపూడి ఒక పాత్రని రాసుకున్నాడట. ఇలా సినిమా ఇంకా ప్రారంభానికి ముందే అభిమానులలో ఉత్సాహాన్ని నింపే వార్త చెప్పారు అనిల్ రావిపూడి.ఇక అనిల్ రావిపూడి ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘బాలకృష్ణగారితో చేయబోయే సినిమాలో కామెడీ డోస్ ఉంటుంది, అయితే ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్‌ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే ఉంటుంది అని చెప్పారు.