Tollywood Heroes : అసలు తెలుగు లో ఎవరు నెంబర్ వన్ హీరో…అసలు ఎలా నిర్ణయిస్తారు…?

Tollywood heroes : తెలుగు హీరోల్లో మా హీరో నెంబర్ వన్ అంటే మా హీరో అంటూ అభిమానులు వారి లెక్కలను చెప్పడం కామన్. కానీ నిజంగా ఒక హీరో టాప్ అని మరో హీరో కాదని ఎలా చెపుతారు. ఏ ప్రాతిపదికన లెక్కగడతారు.ఈ లాజిక్స్ ఏమి ఉండవు అభిమానులకు కేవలం మా హీరోనే టాప్ అంటూ కాలర్ ఎగరేస్తారు.మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో నెంబర్ గేమ్ మీద అభిమానులకు ఉండే ఆసక్తి మామూలు విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లో దాదాపుగా మూడు దశాబ్దాలకు పైగా కొనసాగారు, 2007 వ సంవత్సరం లో ఆయన సినిమాలకు రిటైర్‌మెంట్ ప్రకటించి రాజకీయాల్లోకి వెళ్ళేలోపు మెగాస్టార్ తర్వాత నెంబర్ 1 హీరో ఎవ్వరు అనే దానిపై ఎన్నో చర్చలు జరిగాయి. ఇక పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు మరియు ప్రభాస్ వంటి వారు రికార్డ్స్ మీద రికార్డ్స్ సృష్టిస్తూ తమకంటూ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ కూడా మంచి హిట్ సినిమాలతో ఫ్యాన్ ఫాలోయింగ్ తో నెంబర్ వన్ రేస్ కి వచ్చేసారు.

ఇక స్థిరంగా ఎవరు హిట్ సినిమాలనే తీయలేరు. రికార్డులను బద్దలు కొట్టలేరు. అందుకే ఎవరు నెంబర్ వన్ అనేది చెప్పడం కష్టం.ఇక అయినా అసలు నెంబర్ హీరో ఎవరని తేల్చాలంటే అసలు ఏ ప్రాతిపదికను తీసుకోవాలో తెలియని పరిస్థితి.ఇక మొదటి రోజు ఓపెనింగ్స్ ఆధారంగా రెండూ విభాగాలలో హీరోలపై సర్వే చేసారు. మొదటిది ఓపెనింగ్స్ రెండోది సినిమా లాంగ్ రన్….

ఇక సినిమా టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ తో అమెరికా నుండి అనకాపల్లి వరకు దూసుకుపోయే హీరో ఎవరని సర్వే చేయగా పవన్ కళ్యాణ్ అని తేలింది ఆయన తర్వాత ఆంధ్రాలో ఎన్టీఆర్ పేరు వినపడింది. అయితే నిజాం ఏరియాలో. మాత్రమే ప్రభాస్ పేరు వినపడిందట దీన్ని బట్టి పవన్ నెంబర్ 1 అని తేల్చారు.ఇక లాంగ్ రన్ సినిమాల విషయంలో మహేష్ బన్నీలకు తీవ్రమైన పోటీ ఉందట. అయితే మహేష్ నెంబర్ 1 అని తేల్చారు. మహర్షి మరియు సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలతో మహేష్ బాబు ఇండస్ట్రీ లో ఎలాంటి రికార్డ్స్ సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనితో మహేష్ బాబు నెంబర్ 1 అని అత్యధిక మంది ఈ సర్వే లో తెలిపారు. ఇక మహేష్ బాబు తర్వాత అల్లు అర్జున్ పేరునే చెప్పారు, ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ సినిమాలు అలా వైకుంఠపురం లో మరియు పుష్ప బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించాయి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కానీ అల్లు అర్జున్ కంటే ఎక్కువగా మహేష్ బాబు కెరీర్ లాంగ్ రన్ సినిమాలు ఉండడం తో లాంగ్ రన్ లో మహేష్ బాబు నెంబర్ 1 అని తేల్చి చెప్పింది ఈ సర్వే.అలా పవన్ మహేష్ లు నెంబర్ వన్ గా మిగిలారు.