Home TV SHOWS Bigg boss 4: నాగార్జున ఫేవరేట్ కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది? అతడే విన్నరా?

Bigg boss 4: నాగార్జున ఫేవరేట్ కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది? అతడే విన్నరా?

బిగ్ బాస్ 4… ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఈ షో గురించే చర్చ. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రియాలిటీ షో. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వాళ్లకు పాపులారిటీ మామూలుగా రావడం లేదు. అందులోకి వెళ్లడమంటేనే లక్కు తోక తొక్కినట్టు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన వాళ్లకు మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. అందుకే.. చాలామంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలని కలలు కంటుంటారు.

Who Is Favourite Contestant Of Nagarjuna In Bigg Boss House
who is favourite contestant of nagarjuna in bigg boss house

తాజాగా.. బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ కూడా మాంచి దూకుడు మీదుంది. ఇంకో నెల రోజుల్లో బిగ్ బాస్ సీజన్ పూర్తికానుంది. ప్రస్తుతానికి హౌస్ లో మిగిలింది ఏడుగురు సభ్యులే. ఈ వారం నామినేషన్లు కూడా పూర్తయ్యాయి. అభిజీత్, సోహెల్ తప్ప.. మిగితా ఇంటి సభ్యులంతా నామినేట్ అయ్యారు.

అయితే.. తాజాగా బిగ్ బాస్ కు సంబంధించిన ఓ విషయం వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్ హౌస్ట్ నాగార్జునకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో తెలిసిపోయింది. నాగ్ కు ఇష్టమైన కంటెస్టెంట్ ఇతడే అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారంలో ఉంది. అందుకే… నాగ్ ఆ కంటెస్టెంట్ ను మందలించి.. సెట్ రైట్ చేశాడని టాక్ వినిపిస్తోంది.

ఇంతకీ ఎవరా కంటెస్టెంట్ అంటారా? లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హీరో అభిజీత్. అవును… అభిజీతే.. నాగ్ కు ఇష్టమైన కంటెస్టెంట్ అట. నాగ్ కే కాదు.. ఆయన భార్య అమలకు, వాళ్ల ఇంట్లో అందరికీ అభిజీత్ ఫేవరేట్ కంటెస్టెంట్ అట.

Who Is Favourite Contestant Of Nagarjuna In Bigg Boss House
Abhijeet is the Nag’s favourite contestant

అందుకే.. మొన్న వీకెండ్ షోలో కూడా అభిజీత్ సరిగ్గా డ్యాన్స్ చేయకున్నా.. డ్యాన్స్ బాగా చేశావంటూ నాగ్ ఆయన్ను ఎంకరేజ్ చేయడం చూస్తుంటే.. ఈ సీజన్ విన్నర్ నో డౌట్ ఇంకెవరో కాదు.. అభిజీతే అని స్పష్టంగా తెలిసిపోతోంది అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఈ నాలుగు వారాలు ఏదో సోసోగా నడిపించేసి… అభిజీత్ కు టైటిల్ ఇచ్చేసి బిగ్ బాస్ షోను మూసేసేందుకు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ప్లాన్ చేసుకుంటున్నారట. అందుకే.. నాగ్.. తన ఫేవరేట్ కంటెస్టెంట్ పై శ్రద్ధ పెట్టారంటూ వార్తలు వస్తున్నాయి. చూద్దాం మరి.. నాగ్ ఫేవరేట్ కంటెస్టెంట్ ఈసారి టైటిల్ గెలుస్తాడో లేదో?

- Advertisement -

Related Posts

షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న టాలీవుడ్ యంగ్ హీరో ??

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిలవబోతున్న ఒక యంగ్ హీరో జైలుకి వెళ్ళే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలోనూ న్యుస్ వైరల్ గా మారింది. సినిమాలలో నటించాలని...

అమ్మ బాబోయ్ ఆ పనులు కూడా మొదలెట్టేసింది.. వంటలక్క మామూల్ది కాదు!!

కార్తీకదీపం సీరియల్‌కు ఉన్న ఫాలోయింగ్.. వంటలక్క అలియాస్ దీప పాత్రను అద్భుతంగా పోషిస్తోన్న ప్రేమీ విశ్వనాథ్‌కు ఉన్న ఫాలోయింగ్ స్టార్ హీరోయిన్లకు కూడా ఉండదేమో. ప్రేమీ విశ్వనాథ్ అంటే ఎవ్వరైనా గుర్తు పడతారో...

ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చాడు..!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజా అప్ డేట్ ను ఇచ్చారు రాజమౌళి బృందం. సంక్రాంతి...

ఇలా ముద్దులు పెట్టేస్తోందేంటి?.. రెచ్చగొడుతోన్న పాయల్

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ...

Latest News