వినాయక్ వల్లనే కాకపొతే ఇక ‘చిరంజీవికి’ దిక్కు ఎవరు ?

who is capable of fulfilling chiranjeevi's wish ?

చిరంజీవి గ్యాప్ లేకుండా వరుసగా కొన్ని సినిమాలకి సైన్ చేసాడు.ఇందులో ప్రస్తుతం కొరటాలతో మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఐడియా ఊపులో మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ ను తెలుగులో రీమేక్ చేయాలని చిరంజీవి భావించాడు. ఆ సినిమాలోని హీరో పాత్ర చిరంజీవికి బాగా నచ్చిందట. అందుకే ఆ రీమేక్ చేయాలని చాలా ఆశపడ్డాడట. అయితే లూసీఫర్ తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా చూస్తే ఖచ్చితంగా ఆడదు అనే విషయం అందరికి తెలుసు. లూసీఫర్ ఒరిజినల్ వర్షన్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ మచ్చుకు కూడా కనిపించవు.. హీరో పాత్రకు జోడీ ఉండదు.. కథ కూడా తెలుగు నేటివిటీకి కాస్త దూరంగా ఉంటుంది. తెలుగులో లూసీఫర్ ను రీమేక్ చేయాలంటే ఇవన్నీ ఉండాల్సిందే. కాని ఆ కథకు ఇవన్ని జోడిస్తే మెయిన్ కథ పక్క దారి పట్టే అవకాశం ఉంది. అందుకే లూసీఫర్ రీమేక్ అనేది ఎవరు అయితే దానికి టేకప్ చేస్తారో వారికి ఛాలెంజ్ అనడంలో సందేహం లేదు.

who is capable of fulfilling chiranjeevi's wish ?
who is capable of fulfilling chiranjeevi’s wish ?

మొదట లూసీఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు సాహో దర్శకుడు సుజీత్ కు అప్పగించారు. ఆయన దాదాపు మూడు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేసిన తర్వాత సరిగా రాకపోవడంతో ఆయన్ను తప్పించారనే వార్తలు వచ్చాయి. ఆ బాధ్యతను అనుభవజ్ఞుడు అయిన వినాయక్ చేతిలో పెట్టారు. ఆ విషయం ఆయనకు కూడా నచ్చడంతో బాధ్యతలు స్వీకరించాడట. అయితే ముందుగా చెప్పుకున్నట్లుగా లూసిఫర్ రీమేక్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్. కథ మారకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి హీరోయిన్ పాత్రను జొప్పించడం అంటే కష్టంగా ఉందట. రెండు మూడు వర్షన్ లు స్క్రిప్ట్ రెడీ చేసినా కూడా మెగా కాంపౌండ్ ను ఒప్పించలేక పోయాడట. దాంతో వినాయక్ నా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేశాడట. దాంతో ఆ రీమేక్ బాధ్యత ఎవరకి వరిస్తుందో , చిరంజీవి ఆశని నెరవేరుస్తారో అని చర్చ జరుగుతుంది.