డీప్ ఫేక్.! రష్మిక ఇమేజ్‌ని డ్యామేజ్ చేసిందెవరు.?

రష్మిక మండన్నాకి సంబంధించిన ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. డీప్ ఫేక్ అనే పేరుతో వైరల్ అవుతోన్న ఈ ఫేక్ వీడియో పట్ల రష్మిక తన ఆవేదనను వ్యక్తం చేస్తోంది.

అయితే, ఇలాంటివి సోషల్ మీడియాలో కొన్ని వందలు, వేలు, లక్షల వీడియోలుంటాయ్. సెలబ్రిటీల విషయంలో ఇలాంటి ఫేక్ వీడియోలు చాలా చాలా కామన్. అందుకే వాళ్లు వాటిని అస్సలు పట్టించుకోరు.

గతంలో సీనియర్ నటి త్రిష్ విషయంలోనూ ఇలాంటి ఓ ఫేక్ వీడియోనే హల్ చల్ చేసింది. కొన్నాళ్లు ఆ వీడియో గురించి మాట్లాడుకున్నారు. గట్టిగానే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత మర్చిపోయారు.

కానీ, రష్మిక విషయంలో మరోలా జరుగుతోంది. ఏకంగా ఈ వీడియో గురించి సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్ వంటి ఆ స్థాయి సెలబ్రిటీ స్పందించడంతో ఈ వీడియోకి మరింత క్రేజ్ వచ్చేసింది.

ఇంతవరకూ లక్షల మందికి మాత్రమే ఈ వీడియో చేరువయితే, సెలబ్రిటీల రెస్పాన్స్ తర్వాత ఏకంగా కోట్ల మందికి చేరువవుతోంది ఈ వీడియో. దీనివల్ల ఒరిగిందేంటీ రష్మికకు. వేరే సెలబ్రిటీల విషయంలో అయితే, ఇలా జరిగితే ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది. క్రేజ్ పెరుగుతుంది. కానీ, రష్మిక మండన్నా నేషనల్ క్రష్ కదా.! ప్రత్యేకంగా ఆమెకు ఇలాంటి కొత్త పబ్లిసిటీ అవసరమా.?

కొత్తగా వచ్చే పబ్లిసిటీ కాదు.. రష్మిక ఇమేజ్‌కి డ్యామేజ్ జరుగుతోంది ఈ వీడియో వల్ల అనే చర్చ వినిపిస్తోంది. మరోవైపు ఈ మార్ఫింగ్ వీడియోలోని ఒరిజినల్ సెలబ్రిటీ అయిన జారా పటేల్‌కి క్రేజ్ పెరిగిపోయింది ఈ అనవసర చర్చ వల్ల.!