Home News బిగ్ బాస్ ఈ సారి కరుణించేది లేదా ?.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేవారెవరంటే?

బిగ్ బాస్ ఈ సారి కరుణించేది లేదా ?.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేవారెవరంటే?

బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. మ‌రో నెల రోజుల‌లో విజేత ఎవ‌ర‌నేది తెలియ‌నుండ‌గా, టాప్ 5లో ఎవ‌రుంటార‌నే దానిపై విస్త్రృత చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఇంట్లో 9 మంది స‌భ్యులు ఉండ‌గా, వారిలో అఖిల్, అభిజీత్, అవినాష్, లాస్య, సోహైల్ లు టాప్ 5లో ఉంటార‌ని స‌మాచారం. ఇక టాప్ 2కి అభిజిత్, లాస్య లేదంటే అభిజీత్, అఖిల్ ఉంటార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైన షో చివ‌రి స్టేజ్‌కి వ‌స్తుండ‌డంతో అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది.

Monal Meha | Telugu Rajyam

ఇక ఈ వారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌పై కూడా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం ప‌దోవారానికిగానూ అభిజిత్‌, సోహైల్, మెహ‌బూబ్‌, అరియానా, మోనాల్‌, హారిక ఎలిమినేష‌న్ జోన్‌లో ఉన్నారు. వీరిలో మెహ‌బూబ్‌, ఆ త‌ర్వాత మోనాల్‌ డేంజ‌ర్ జోన్‌లో ఉన్నారు. మెహ‌బూబ్ ఎలిమినేట్ అవుతాడ‌ని జోరుగా చ‌ర్చ‌లు న‌డుస్తున్న‌ప్ప‌టికీ, బిగ్ బాస్ ద‌త్త పుత్రిక మోనాల్ ని ఈ వారం బ‌య‌ట‌కు పంప‌నున్న‌ట్టు తెలుస్తుంది.ప్రేక్ష‌కులు మోనాల్ బాధ‌ని భ‌రించ‌లేక బ‌య‌ట‌కు పంపండి మ‌హాప్ర‌భో అంటున్న‌ప్ప‌టికీ, బిగ్ బాస్ త‌న ద‌త్త‌పుత్రిక హౌజ్‌లో ఉంచి ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు. కాని ఈ సారి మాత్రం మోనాల్ పై వేటు ప‌క్కా అంటున్నారు

ప‌దోవారం ఎలిమినేష‌న్‌లో మెహ‌బూబ్‌, మోనాల్ మ‌ధ్య బిగ్ ఫైట్ న‌డుస్తుంది. ఓసారి మోనాల్‌ని కాపాడేందుకు కుమార్ సాయిని బ‌లి చేయ‌గా, ఈ సారి మెహ‌బూబ్‌ని బ‌లి చేసి మోనాల్‌ని సేవ్ చేస్తారా అన్న ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. మోనాల్ హౌజ్‌ని వీడితే అందాల విందు ఎక్క‌డ మిస్ అవుతుందేమోన‌ని ఆమెని త‌ప్ప‌క బిగ్ బాస్‌లో ఉంచుతున్నార‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రోవైపు నాగార్జున ప్రేక్ష‌కుల ఓట్ల ప్ర‌కార‌మే ఎలిమినేష‌న్ జ‌రుగుతుంద‌ని ఒట్టేసి చెబుతున్నారు. ఏదేమైన ఈ వారం మోనాల్ ఎలిమినేట్ అవుతుంద‌ని అంటుండ‌గా, మళ్లీ ట్విస్ట్ ఇచ్చి మెహ‌బూబ్‌ని బిగ్ బాస్ గ‌డ‌ప దాటిస్తారా చూడాలి

- Advertisement -

Related Posts

ఇంత అనుభవం పెట్టుకొని చంద్రబాబు ఇలాంటి తప్పు చేశాడేంటి?? టీడీపీ నాయకులే తల పట్టుకున్నారు

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరికి తెలుసు. దాదాపు పతనావస్థకు చేరువలో ఉంది. ఇంకొన్నాళ్ళు ఇదే పరిస్థితి కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగు అయ్యే అవకాశం ఉన్న సందర్భంలో...

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

Latest News