బిగ్ బాస్ 4: ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ఏ ఏ ఫైన‌లిస్ట్‌కి స‌పోర్ట్ చేస్తున్నారో తెలుసా?

Bigg Boss says we are proud to have such a mature member in the house

బిగ్ బాస్ సీజ‌న్ 4 కార్య‌క్ర‌మం క‌రోనా సంక్షోభంలోను గ్రాండ్‌గా లాంచ్ అయింది. 19 మంది స‌భ్యుల‌తో మొద‌లైన ఈ కార్య‌క్ర‌మం చివ‌ర‌కు వ‌చ్చే స‌రికి 5 గురితో ఎండ్ అయింది. నాగార్జున సీజ‌న్ మొత్తాన్ని స‌క్సెస్ ఫుల్‌గా న‌డిపించ‌గా, ఈ రోజు సాయంత్రం సీజ‌న్ 4 విజేత ఎవ‌ర‌న్న‌ది ప్ర‌క‌టించ‌నున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం అరియానా, అభిజీత్‌ల‌లో ఒక‌రు ట్రోఫీ గెలుచుకుంటార‌ని తెలుస్తుంది. ఇక చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. మెహ‌రీన్‌తో పాటు ప‌లువురు అందాల భామ‌లు బిగ్ బాస్ స్టేజ్‌పై త‌న డ్యాన్స్‌ల‌తో అల‌రించ‌నున్నారు.

Nagarjuna about Records Of Bigg Boss 4 Telugu

చూస్తుండ‌గానే బిగ్ బాస్ సీజ‌న్ 105 రోజులు గ‌డిచిపోయాయి. ఈ రోజుతో శుభంకార్డ్ ప‌డ‌నుంది. మ‌రి టైటిల్ ట్రోఫీ ఎవ‌రు గెలుస్తారు అని ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తున్న స‌మ‌యంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ త‌మ‌కు న‌చ్చిన వారిని గెలిపించేందుకు చాలా కృషి చేస్తున్నారు. సోష‌ల్ మీడియా ద్వారా ఫుల్ క్యాంపెయిన్ చేస్తూ ఫేవ‌రేట్ కంటెస్టెంట్స్‌ని గెలిపించ‌మ‌ని కోరుతున్నారు. మరి ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనేది పరిశీలిస్తే.. అభిజీత్: నోయల్, స్వాతి దీక్షిత్, కుమార్ సాయి, లాస్య
అఖిల్: మోనాల్, గంగవ్వ
సోహెల్: మెహబూబ్, సుజాత
అరియానా: అమ్మ రాజశేఖర్, అవినాష్, దివి, దేవి నాగవల్లి
హారిక: నోయల్

సూర్య కిరణ్, కరాటే కళ్యాణి ఫ‌లానా వ్య‌క్తికి స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు ఎక్క‌డా చెప్ప‌లేదు

బిగ్ బాస్ సీజ‌న్ 1 విజేత‌గా శివ బాలాజీ నిలిస్తే సీజ‌న్ 2 విజేతగా కౌశ‌ల్, సీజ‌న్ 3 విజేత‌గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. సీజ‌న్ 4 విజేత‌గా అభిజీత్ నిలుస్తాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ అందులో నిజ‌మెంత అనేది తెలియాలంటే కొన్నిగంట‌లు ఆగ‌క త‌ప్పదు. అభిజీత్‌కు నాగ‌బాబు, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా స‌పోర్ట్ చేస్తున్న విష‌యం తెలిసిందే.